ఒక ఏజ్ వచ్చిన తర్వాతే షుగర్ వస్తుందనే రోజులు పోయాయ్. ఇప్పుడు చిన్నాపెద్దా తేడా లేకుండా షుగర్ అందరినీ పలకరిస్తోంది. సాధారణంగా పెద్దవాళ్లు ఏదైనా తేడాగా అనిపిస్తే టెస్టు చేసుకొని, షుగర్ ఉందా? లేదా? అనేది తెలుసుకుంటారు. మరి పిల్లల విషయంలో షుగర్ ను గుర్తించడం ఎలా? ఇవిగో.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పిల్లలైనా సరే షుగర్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. అవేంటంటే..
- బరువు తగ్గుతారు : డయాబెటీస్ ముఖ్య లక్షణం బరువు తగ్గడం. హెల్దీగా ఉన్న చిన్నారులు ఉన్నట్టుండి బరువు తగ్గితే ఎందుకైనా మంచిదని షుగర్ టెస్టు చేయించాల్సిందే.
- నీళ్లు ఎక్కువగా తాగడం : షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు ఎక్కువగా దాహం వేస్తుంటుంది. పిల్లలు కూడా నీళ్లు ఎక్కువగాతాగుతున్నా అనుమానించాల్సిందే.
- అతి మూత్ర విసర్జన: షుగర్ వ్యాధి ఉంటే పిల్లలు అతిగా మూత్ర విసర్జన చేస్తుంటారు. రోజుకు ఐదారుసార్లు కామనే. అలా కాకుండా అరగంటకోసారి మూత్రానికి వెళ్తే తప్పకుండా టెస్ట్ చేయించాలి.
- స్పర్శ కోల్పోవడం: కాళ్లకు, చేతులకు దెబ్బ తగిలినప్పుడు పిల్లలు ఏడుస్తారు. అలా ఏడ్వకుండా ఉంటే.. దెబ్బ తగిలిన చోట స్పర్శ ఉందా? లేదా? అనేదిచూడాలి. ఒకవేళ స్పర్శ లేదంటే వెంటనే షుగర్ టెస్ట్ చేయించాలి.
- కడుపు నొప్పి: కడుపునొప్పి పిల్లలకు కామన్. తిన్నది సరిగ్గా జీర్ణం కాక కడుపునొప్పి అనుకుంటాం. కానీ కడుపునొప్పి తరచూ వస్తుంటే ఓసారి డాక్టర్ దగ్గరకు వెళ్లి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.
- చూపు తగ్గినా: షుగర్ వ్యాధి ఉన్నవాళ్ల చూపు అకస్మాత్తుగా తగ్గిపోతుంది. ఇది చిన్నారుల్లో కూడా కనిపిస్తుంది. సరిగా కనిపించడం లేదని పిల్లలు చెబితే షుగర్ టెస్ట్ చేయించడం బెటర్.
ALSO READ : Good Health : సిగరెట్ తాగేవాళ్లు.. ఈ ఫ్రూట్స్,ఆకు కూరలు తింటే పొగ తాగాలనే ఆలోచన తగ్గుతుంది..!
అయితే చిన్నారులు అందరికీ ఈ లక్షణాలన్నీ కనిపించాలని ఏం లేదు.కొంతమందికి ఇలాంటి లోపాలు ఏం లేకున్నా షుగర్ ఉండే అవకాశం ఉంది. అందుకే షుగర్ పిల్లలకు రాదనే అభిప్రాయంతో ఉండకుండా టెస్టులు చేయించాలి.
–వెలుగు,లైఫ్–