అధిక బరువు వల్ల అన్నీ అనర్ధాలే అంటున్నారు వైద్యులు. ఇది పెద్దవాళ్లకే కాదు, చిన్న పిల్లలకూ వర్తిస్తుంది. ఈ మధ్య చిన్నా రులు కూడా అధిక బరువుతో బాధపడుతున్నారు. ఆహారం మీద నియంత్రణ లేకపోవటం, వేళకు తినకపోవడం, ఎక్కువ బయట ఫుడ్స్ తినడం వల్ల బరువు పెరుగుతున్నారని నిపుణులు చెప్తున్నారు. కానీ ఈ మధ్యకాలం లో అమెరికాలోని పరిశోధకులు ఎక్కువ బరువున్న పిల్లల గురించి పరిశోధన చేశారు. సుమారు అయిదు వేల మందిని ఈ పరిశో ధనకు ఎన్నుకున్నారు.
అయితే సాధారణ బరువు ఉన్న పిల్లలు 60శాతం మందైతే, మిగిలిన 40 శాతం మంది ఎక్కువ బరువు ఉన్న వాళ్లను ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వారమో.నెలో కాకుండా ఎక్కువకాలం పరిశీలించారు. చివరకు అధ్యయనకారులు అధికబరువు వల్ల చిన్నారులకు ఆస్తమా వచ్చే అకాశాలు ఎక్కువని తేల్చారు.
Also Read :- ఇలా తింటే మాత్రం మీ శరీరం ఐరన్ బాడీలా తయారవుతుంది..!
అంటే, అధిక బరువు 23 శాతం మందికి ఆస్తమా వచ్చిందని చెప్పారు. కానీ అధిక బరువు వల్ల మాత్రమే వీళ్లకు ఆస్తమా వచ్చిందా లేక జీన్స్ ప్రభావం వల్ల వచ్చిందా అన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేదు.. కానీ నేటితరం తల్లిదండ్రులు పిల్లలు తినే ఆహారం మీద దృష్టి పెట్టకపోతే వాళ్లు ఎక్కువ బరువుతో పాటు అనేక ఇతర రోగాల పల్ల కూడా ఇబ్బంది పడతారు అన్నది మాత్రం నిజమని పరిశోధకులు చెబుతున్నారు.
- వెలుగు, లైఫ్-