
క్రికెట్ అనేది ఎమోషన్స్ తో నిండిన ఆట. కొన్ని సందర్భాల్లో ఆటగాళ్ల సెలెబ్రేషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. వికెట్ తీసినప్పుడు ఒక్కోసారి అత్యుత్సాహంతో ప్రత్యర్థి ఆటగాళ్లపై రెచ్చిపోవడం జరుగుతుంది. అలాంటి సంఘటనే తాజాగా ఒకటి చేసుకుంది. స్కూల్ క్రికెట్ లో భాగంగా పిల్లలు చేసుకున్న చేసుకున్న సెలెబ్రేషన్ వైరల్ గా మారుతుంది. ఫీల్డింగ్ జట్టు చేసిన రనౌట్ తెగ నవ్వు తెప్పిస్తుంది.
ప్రిన్స్ సుందర్ ఠాకూర్ వేసిన బంతిని వైభవ్ శర్మ కవర్స్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేసుకున్నారు. అయితే త్రో సరిగా వేయకపోవడంతో రెండో రన్ కోసం చౌహన్ క్రీజ్ దాటాడు. కానీ నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న వైభవ్.. సింగిల్ వద్దని క్రీజ్ వదిలి రాలేదు. రెండో రన్ కోసం అప్పటికే క్రీజ్ సగం దాటిన చౌహన్ వెనక్కి తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. ఈజీ రనౌట్ చేసే క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న జట్టు రనౌట్ చేయకుండా సెలెబ్రేషన్ చేసుకోవడం మొదలు పెట్టారు.
►ALSO READ | MI vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ముంబై జట్టులో రెండు మార్పులు
బ్యాటర్ వైపు చూస్తూ మొదట వికెట్ కీపర్.. ఆ తర్వాత ఫీల్డర్లు కూడా వికెట్ కీపర్ తో కలిసి బాంగ్రా డ్యాన్స్ చేశారు. ఈ సెలెబ్రేషన్ చూడడానికి ర్యాగింగ్ ల అనిపించింది. కొంచెం సరదాగా.. కొంచెం వెటకారంగా అనిపించింది. మొత్తానికి ఈ చిన్న పిల్లల సెలెబ్రేషన్ ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్పిస్తుంది.
Bowling team does 'Bhangra' before running out the batter. 🤣 pic.twitter.com/5cXjCQp08T
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2025