చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ పై దాడి

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ పై దాడి

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ పై  గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. శుక్రవారం ( ఫిబ్రవరి 9, 2025 ) పలువురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటికి వెళ్లి దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు దుండగులు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు పోలీసులు. 

రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని..  అందుకు రంగరాజన్ నిరాకరించగా సదరు వ్యక్తుల తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని.. తనపైనా దాడి చేశారని రంగరాజన్ తెలిపారు. తమపై దాడికి పాల్పడ్డవారితో పాటు పరోక్షంగా వారికి సహకరించినవారిని కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. 

ALSO READ | దక్షిణాది ఏకం కావాలి.. రాజ్యాంగ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి..