శేష వస్త్రంతో ముద్దులు, కౌగిలింతలా? అపచారం.. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం

తిరుమలలో హీరోయిన్ కృతిని(Kriti Sanon) దర్శకుడు ఓం రౌత్(Om Raut)  కౌగిలించుకుని ముద్దు పెట్టడంపై చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్(CV Rangarajan) ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల కొండపైన ఇలాంటి వికార చేష్టలు చేయకూడదని, సమ్మతం కాదని అయన సూచించారు. ఈ వివాదంపై తాజాగా స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

"తిరుమల కొండపై కొన్ని నియమాలు పాటించాలని, భక్తి, ఆలోచన నియమాలు ఉండాలని తెలిపారు. తిరుమల కొండకు భార్యాభర్తలు కలిసి వచ్చినా, కళ్యాణోత్సవంలో పాల్గొన్నా కూడా.. ఆలోచనా విధానంలో జాగ్రత్త పడతారు. వేరే ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడతారు. అలాంటి ప్రదేశంలో బహిరంగంగా కౌగలించుకుని, చుంబనం చేయడం దారుణమైన చర్య. సాధారణంగా నేను టీవీ ఛానల్స్ ముందుకు రాను. కానీ.. ఎన్టీ రామారావు(NTR), అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageshawararao) లాంటి మహానుభావులు కూడా రాములవారి పాత్ర పోషించినప్పుడు వాళ్ళను దైవ సమానులుగా ప్రేక్షకులు భావించారు. వాళ్ళూ కూడా అంతే భక్తి శ్రద్దలతో ఉన్నారు. ఆ విధంగానే నడుచుకోవాలి. ఇక సీత పాత్రకు కృతి సనన్ సూట్ కాలేదు'' అని అన్నారు రంగరాజన్.

ప్రస్తుతం రంగరాజన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.