మిర్చిని తగలబెట్టిన దుండగులు

మిర్చిని తగలబెట్టిన దుండగులు
  • రూ.12 లక్షల ఆస్తి నష్టం

పినపాక, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి మిర్చి పంటకు నిప్పంటించారు. బాధిత రైతు పొనగంటి పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం. పదెకెరాల్లో మిర్చి పంట వేసి రెండవ కోత పూర్తి చేసి మార్కెట్​కు తరలించేందుకు 70 క్వింటాళ్ల ఎండు మిర్చిని కల్లంలో నిల్వ చేశాడు. 

రూ.12 లక్షల పంట నష్టం జరిగినట్లు పురుషోత్తం వాపోయాడు. సమాచారం తెలుసుకున్న పినపాక ఫైర్​ స్టేషన్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏడూళ్లబయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్​కుమార్​ స్నిఫర్​ డాగ్​ను రప్పించి దర్యాప్తు చేపట్టారు. తహసీల్దార్​ నరేశ్, ఏవో వెంకటేశ్వర్లు కాలిపోయిన మిర్చిని పరిశీలించారు.