ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళన

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళన

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు  గురువారం ఆందోళన చేశారు.   ఏనుమాముల మార్కెట్​కు సుమారు  18వేల   మిర్చి బస్తాలు రాగా  మార్కెట్లోని వ్యాపారులు మద్దతు ధర ఇవ్వడం లేదని  రైతులు ఆవేదన చెందారు.

క్వింటాల్​కు రూ.1000, నుంచి రూ.500 వరకు ధర తగ్గించి  వ్యాపారులు  కొంటున్నారని అన్నారు.  ఏంటని అడిగితే..   స్పందించడం లేదని చెప్పారు. మార్కెట్ కమిటీ ఆఫీసర్ల వచ్చి రైతులతో మాట్లాడి  ఆందోళన విరమింపచేశారు.