
ఖమ్మం టౌన్/వరంగల్ సిటీ, వెలుగు : ఖమ్మం, వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు సోమవారం మిర్చీ పోటెత్తింది. శని, ఆదివారాలు వరుసగా సెలవులు రావడంతో సోమవారం రైతులు భారీ మొత్తం మిర్చి తీసుకువచ్చారు. ఖమ్మం మార్కెట్‌కు 1.05 లక్షల బస్తాలు, ఏనుమాముల మార్కెట్‌కు 80 వేల బస్తాల మిర్చి వచ్చింది.
మంగళవారం ఒక్కరోజే మార్కెట్ ఓపెన్ ఉండనుండగా, మహాశివరాత్రి సందర్భంగా బుధ, గురువారాలు సెలవులు ఇచ్చారు. శుక్రవారం అమావాస్య కావడం, శని, ఆదివారాలు సాధారణ సెలవులు ఉన్నాయి. దీంతో రైతులు సోమవారమే పెద్ద ఎత్తున మార్కెట్‌కు తరలివచ్చారు.