
చేవెళ్ల, వెలుగు: వారం రోజులుగా కొనసాగుతున్న చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. ఆలయ సమీపంలోని గండిపేట జలాశయానికి తీసుకెళ్లిన అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి విగ్రహానికి చక్ర స్నానం చేయించారు. అనంతరం జలాశయం నుంచి నీటిని తెచ్చి ఆలయంలోని స్వామి వారికి అభిషేకం చేశారు. ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్ పాల్గొన్నారు. ప్రభుత్వ చీఫ్విప్పట్నం మహేందర్రెడ్డి స్వామివారిని
దర్శించుకున్నారు.