చిలుకూరు బాలాజీని దర్శించుకున్న మేఘాలయ గవర్నర్

చిలుకూరు బాలాజీని దర్శించుకున్న మేఘాలయ గవర్నర్

చేవెళ్ల, వెలుగు : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​మండల పరిధిలోని చిలుకూరు బాలాజీని మేఘాలయ గవర్నర్ విజయ్ శంకర్ దర్శించుకున్నారు. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తర్వాత సుందరేశ్వరస్వామి ఆలయాన్ని కూడా దర్శించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను వివరించారు.