- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహసి రెడ్డి
కౌడిపల్లి, వెలుగు : జిల్లాలో లైబ్రరీల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంశీ కృష్ణతో కలిసి ఆమె మండల కౌడిపల్లిలోని లైబ్రరీ బిల్డింగ్ లో కొనసాగుతున్న పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ ఆఫీస్ ను సందర్శించారు. ప్రస్తుతం లైబ్రరీ కొనసాగుతున్న పాత భవనం శిథిలావస్థకు చేరడంతో విలువైన పుస్తకాలన్నీ పాడవుతున్నాయన్నారు.
పోటీ పరీక్షలకు చదువుకునే విద్యార్థులు శిథిల భవనంలో వెళ్లి చదవలేక ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి తేవడంతో లైబ్రరీని సొంత భవనం లోకి మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం లైబ్రరీల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, లైబ్రరీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, జాకిరుద్దీన్, కృష్ణ గౌడ్, శ్రీనివాస్ గుప్తా, వెంకటేశం గుప్తా, మక్బూల్ ఉన్నారు.