అమ్మలా పాలిచ్చింది..నాన్నలా ఆడించింది.. పులి పిల్లల మీద చింపాంజీ ప్రేమ..

అమ్మలా పాలిచ్చింది..నాన్నలా ఆడించింది.. పులి పిల్లల మీద చింపాంజీ  ప్రేమ..

పులి పిల్లలకు తల్లిగా మారింది ఓ చింపాంజీ. పులి పిల్లలు ఆడుకున్నప్పుడు ఆట వస్తువుగా మారింది. ఆకలి అయినప్పుడు పాలిచ్చింది. అమ్మలా లాలించింది. నాన్నలా ఆడించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

ప్రేమకు జాతి, కులం, మతం ఉండవు.  ఇది మనుషుల్లోనే కాదు..జంతువుల విషయంలోనూ అప్పుడప్పుడు  ఇది  బయటపడుతుంటుంది. తాజాగా ఓ చింపాంజీ..పులి పిల్లలను ప్రేమగా చూస్తోంది. పులి పిల్లల మీద చింపాంజీ చూపించే ప్రేమను  చూసి ఆశ్చర్యపోవాల్సిందే. 

పులి పిల్లలను చింపాంజీ ప్రేమగా హత్తుకుంటుంది. మెచ్చుకుని తన భుజాల మీద వేసుకుని వీపు నిమురుతుంది. ప్రేమతో ముద్దులు కూడా ఇస్తోంది. పులి పిల్లల మీద చింపాంజీ చూపించే ప్రేమను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. 


ALSO READ : భారతీయుడు 2 మూవీ నచ్చడానికి నేనూ ఓ కారణమవుతా.. హీరో సిద్ధార్థ్‌