చైనా అంబాసిడర్‌పై నెటిజన్ల విమర్శలు
తమ ఆచారమన్న కిరిబటి ప్రజలు
కిరిబటి: కిరిబటిలోని స్థానిక జనం వీపులపై నుంచి చైనా రాయబారి నడుచుకుంటూ వెళ్లిన ఫొటోలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఇదేం తీరంటూ చైనాపై నెటిజన్లు భగ్గుమంటున్నా రు. ఈ నెల తొలి వారంలో కిరిబటి ద్వీపాన్ని చైనా అంబాసిడర్ టాంగ్ సొన్‌గెన్ సందర్శించారు. విమానం దిగాక బోర్లా పడుకున్న 30మంది యువకుల వీపుల పైనుంచి నడిచి వెళ్లారు. సంప్రదాయ బట్టలు వేసుకున్న ఇద్దరు యువతులు
ఆయన చేతులు పట్టుకొని ముందుకు నడిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటో తాజాగా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో చైనాపై విమర్శలు పెరిగాయి. పసిఫిక్‌లో చైనా ప్రాబల్యం పెరుగుతోందని జనం మండిపడుతున్నారు. కిరిబటి ప్రభుత్వం మాత్రం ఇందులో తప్పేంలేదంటోంది. గెస్టులను అలా ఆహ్వానించడం తమ సంప్రదాయంలో భాగమని సమర్థించుకుంది. తమ దేశంలో తొలిసారి పర్యటనకు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ల టైమ్‌లో ఇలాగే వెల్కమ్ చెబుతామని.. కిరిబటి నెటిజన్లు అంటున్నారు. ఇది తరాల నుంచి వస్తున్నఆచారమని, అక్కడి పెద్ద వాళ్లు ఓకే చేశాక ఎవరూ ఎదురు చెప్పరని చెబుతున్నారు.
For More News..