భారత్ బాటలో మరికొన్ని దేశాలు : చైనా యాప్స్ ను బ్యాన్ చేసే దిశగా కీలక నిర్ణయాలు

భారత్ బాటలో మరికొన్ని దేశాలు : చైనా యాప్స్ ను బ్యాన్ చేసే దిశగా కీలక నిర్ణయాలు

ఇటీవల కేంద్రప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్స్‌ పై నిషేధించిన విధించిన సంగతి తెలిసిందే. తాజాగా భారత్ తో పాటు మరికొన్ని దేశాలు చైనాకు చెందిన యాప్స్ డిలీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన టిక్ టాక్ ను అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు బ్యాన్ చేస్తున్నట్లు సమాచారం.

న్యూస్ 18 కథనం ప్రకారం దేశ భద్రత విషయంలో  జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో చైనా కు చెందిన యాప్ లను డిలీట్ చేయాలనే అంశం తెరపైకి వస్తోంది. యూఎస్, ఆస్ట్రేలియా దేశాల్లో చైనా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను డిలీట్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో అమెరికాలో చైనా యాప్స్ ను బ్యాన్ చేసే దిశగా చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో తెలిపారు. చైనా యాప్స్ విషయంలో దేశాధ్యక్షుడు ట్రంప్ కఠినంగా ఉన్నారన్న మైక్..టిక్‌ టాక్ చైనాకు చెందింది. జాతీయ భద్రతకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని దేశానికి చెందిన అనేక మంది నేతలు టిక్ టాక్ ను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దేశానికి ఎటువంటి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, త్వరలో చైనా యాప్స్ బ్యాన్ పై నిర్ణయం తీసుకుంటామని మైక్ పాంపియో వెల్లడించారు.

కాగా 2017 నాటి జాతీయ ఇంటెలిజెన్స్ చట్టం ప్రకారం చైనా ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల నుంచి డేటా తీసుకునే అధికారం ఉంది.  ఆ నిబంధన వల్లే ఇతర దేశాలు డేటా భద్రతపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే భారత్ తో పాటు ఇతర దేశాలు సైతం చైనా యాప్ లను బ్యాన్ చేస్తున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.