భారత శాటిలైట్స్‌పై చైనా ఎటాక్

భారత శాటిలైట్స్‌పై చైనా ఎటాక్

2007 నుంచి దాడి చేస్తోందంటూ అమెరికాలోని సీఏఎస్‌‌‌‌ఐ రిపోర్టు

మన శాటిలైట్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ సేఫ్‌‌‌‌: ఇస్రో చైర్మన్‌‌‌‌ శివన్‌‌‌‌

న్యూఢిల్లీ: సరిహద్దుల్లోనే కాదు, స్పేస్‌‌‌‌లోనూ ఇండియాతో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. మన శాటిలైట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ లక్ష్యంగా కంప్యూటర్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌పై 2007 నుంచి దాడులకు పాల్పడుతోంది. ఈ విషయాలన్నీ అమెరికాలో ఉన్న చైనా ఏరోస్పేస్‌‌‌‌ స్టడీస్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ (సీఏఎస్‌‌‌‌ఐ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి మొత్తం 142 పేజీల రిపోర్టును విడుదల చేసింది. 2012 నుంచి 2018 మధ్య చైనా దాడులు చేసిందని, 2012లో జెట్‌‌‌‌ ప్రొపల్షన్‌‌‌‌ లేబొరేటరీపై జరిగిన ఎటాక్‌‌‌‌ ఒక్కటే సక్సెస్‌‌‌‌ అయిందని చెప్పింది. ఇండియా దగ్గర శాటిలైట్‌‌‌‌ వ్యవస్థపై దాడులను ఎదుర్కోవడానికి కౌంటర్‌‌‌‌ స్పేస్‌‌‌‌ కేపబిలిటీ ఉంది. యాంటీ శాటిలైట్‌‌‌‌ మిసైల్స్‌‌‌‌ టెక్నాలజీతో ఎనిమీ శాటిలైట్లను నాశనం చేయగలదు. అయితే చైనా దగ్గర మల్టిపుల్‌‌‌‌ కౌంటర్‌‌‌‌ స్పేస్‌‌‌‌ టెక్నాలజీ కెపాసిటీ ఉందని సీఏఎస్‌‌‌‌ఐ వివరించింది. యాంటీ శాటిలైట్‌‌‌‌ మిసైల్స్‌‌‌‌, కో ఆర్బిట్‌‌‌‌ శాటిలైట్స్‌‌‌‌, డైరెక్టెడ్‌‌‌‌ ఎనర్జీ వెపన్స్‌‌‌‌, జామర్స్‌‌‌‌తో శత్రు దేశాలపై చైనా పై చేయి సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఇండియా 2019లో యాంటీ శాటిలైట్ మిసైల్ ప్రయోగం విజయవంతంగా చేపట్టిందని, చైనా 2007లోనే ఈ ప్రయోగం చేసిందని కార్నెజీ ఎండోమెంట్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ పీస్‌‌‌‌ అనే మరో సంస్థ 2019లో రిపోర్టు వెల్లడించింది. స్పేస్‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌లను కంట్రోల్‌‌‌‌ చేసే గ్రౌండ్‌‌‌‌ స్టేషన్లపైనా సైబర్‌‌‌‌ ఎటాక్స్‌‌‌‌ చేసే టెక్నాలజీ చైనా వద్ద ఉందని చెప్పింది.

సైబర్‌‌‌‌ దాడులు ఒక్క ఇండియాకే పరిమితం కాదు

తాజా సీఏఎస్ఐ రిపోర్టుపై ఇస్రో అధికారులు మాట్లాడారు. సైబర్ దాడులు జరిగితే అప్రమత్తం చేసే వ్యవస్థ ఇండియాకు ఉందన్నారు. బహుశా  చైనా మనపై సైబర్ దాడులకు ప్రయత్నించి సక్సెస్‌‌‌‌ కాకపోయి ఉండొచ్చని చెప్పారు. మన శాటిలైట్ కేంద్రాలపై సైబర్ దాడులు జరిగాయనడానికి ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్‌‌‌‌ లేదని ఇస్రో చైర్మన్ కె.శివన్ అన్నారు. సైబర్ దాడుల ముప్పు అందరికీ ఉంటుందని, ఒక్క ఇండియాకే పరిమితం కాదన్నారు. మనకు ఇండిపెండెంట్‌‌‌‌, ఐసోలేటెడ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఉందని.. ఏ పబ్లిక్ డొమైన్‌‌‌‌తోనూ అది కనెక్టయి లేదని, కాబట్టి మన వ్యవస్థ సేఫ్‌‌‌‌ అని చెప్పారు.

For More News..

8 రోజుల ముందుగానే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు