మార్కెట్లో ఎక్కడ చూసినా విదేశీ మొబైల్స్ ముఖ్యంగా చైనా బ్రాండ్ల రాజ్యం నడుస్తోంది. దేశీయమార్కెట్లో విదేశీ మొబైల్ కంపెనీలతో పోటీపడే ఒక్కదేశీయ కంపెనీ మచ్చుకైనా కనబడటం లేదు. ఐదేళ్లక్రితం మొబైల్ మార్కెట్ ను ముంచెత్తిన ఇండియన్ కంపెనీలు.. ఇప్పుడు స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లాయి.మన పక్కనే ఉన్న చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ మనమార్కెట్ లో తమ ఆధిపత్యా న్ని సాగిస్తున్నాయి. మరి మన కంపెనీలు ఏం చేస్తున్నాయంటే సమాధానం రావడం మాత్రం కష్టం గానే ఉంది. 2014 లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దేశీయ మొబైల్స్ వాటా 43 శాతంఉండేది. కానీ ప్రస్తుతం ఇది 7 శాతాని కి పడిపోయింది. ప్రస్తుతం భారత్లో అమ్ముడవుతున్న ప్రతీపది స్మార్ట్‌ఫోన్స్ లో ఆరు చైనా బ్రాండ్లవే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ పై చైనా ఆధిపత్యం ఎలా ఉందోదీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పక్కా వ్యూహంతోచైనా కంపెనీలు ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ను ఏలుతున్నా యి. ముందుగా ఆన్ లైన్ మార్గం ద్వారా మొబైల్స్ ను అమ్మిన చైనీస్ కంపెనీలు ఆ తర్వాత ఔట్ లెట్ల ద్వారా తమ మొబైల్స్ ను అమ్ముతున్నా యి.
మిడ్ రేంజ్ ఫోన్లలో చైనా బ్రాండ్ల హవా
మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో చైనీస్ మొబైల్స్ మార్కెట్ షేర్ 80శాతాని కి పైగా ఉంది. ఏడు వేలనుం చి 18వేల వరకు రేట్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలోఎక్కువగా చైనీస్ మొబైల్స్ హవా నడుస్తోంది.రూ.12 వేలకే 4జీబీ ర్యామ్ , డ్యూయల్ కెమెరా ,4వేల ఎమ్ఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో చైనీస్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో మాత్రం అమెరికన్ కంపెనీ యాపిల్, కొరియన్ కంపెనీ శాంసంగ్ తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. ప్రీమియం సెగ్మెంట్లోకూడా చైనీస్ కంపెనీ వన్ ప్లస్ బెస్ట్ ఫీచర్లతో గట్టిపోటీనిస్తు న్నది. తైవాన్ కంపెనీ హెచ్‌టీసీ, చైనాకేచెందిన మోటోరోలా ఫోన్లు మార్కెట్ల నుంచి కనుమరుగయ్యాయని సికిందర్ చెప్పారు. గతంలోకార్బన్, మైక్రోమాక్స్, ఇంటెక్స్ , లావా, సెల్‌కాన్‌లాంటి దేశీయ కంపెనీలు మన మార్కెట్లో తమహవా చూపించాయి. ఎప్పుడైతే చైనా ఫోన్లు బెస్ట్ ఫీచర్స్ తో ఎంటర్ అయ్యాయో అప్పటి నుంచి వాటిపోటీని తట్టుకోలేక ఇండియన్ మొబైల్ కంపెనీలుడీలా పడ్డాయి. 4జీ టెక్నాలజీ ఇండియన్ మార్కెట్లో కి ఎంటర్ అయ్యే టైమ్ ని క్యాచ్ చేసుకున్నా యి చైనీస్ కంపెనీస్. అందుబాటు ధరలో 4జీ మొబైల్స్ ను బెస్ట్ఫీచర్లతో చైనీస్ కంపెనీలు మార్కెట్లో కి తీసుకొచ్చాయి. ఇదే టైమ్ లో 4జీ మొబైల్స్ ను తక్కువ ధరలోలేటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్లో కి తీసుకురావడంలోవెనకబడ్డాయి ఇండియన్ కంపెనీలు. దీంతో వీటిపతనం ప్రారంభమైం ది. చైనీస్ ఫోన్లని జాగ్రత్తగావాడాలంటున్నారు నిపుణులు. రేడియేషన్ లాంటిసమస్యలు ఉంటాయని చెబుతున్నా రు.
తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు అందించడం చైనా బ్రాండ్లకు కలిసొచ్చింది. ఇండి యన్కస్టమర్ మొబైల్ కొనేటప్పుడు అది ఏ దేశానికి చెందిన ఫోన్, ఏ బ్రాండ్ అనే అంశాలను కాకుండాతక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు ఉన్నాయో లేవో చూస్తు న్నారు. అలాగే ఫ్లాష్ సేల్స్ నిర్వహించడం.కొత్త ఫీచర్లు, కొత్త ఆఫర్ల ద్వారా అమ్మకాలను పెంచుకుంటున్నాయి. చైనా బ్రాండ్లు ఆన్ లైన్మార్గంలో దేశీ మార్కెట్లో స్థా నం సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్ లైన్ స్టోర్లను ఏర్పాటుచేస్తూ ఇండి యన్ మార్కెట్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్ నాయి. షియోమి, వివో, ఒప్పో,వన్ ప్లస్, హానర్, లెనోవో వంటి చైనా సంస్థలు అందుబాటు ధరల్లో అధ్భుతమైన ఫీచర్లతో కొత్త కొత్తమోడళ్లను ప్రవేశపెడుతూ దూసుకెళ్తు న్నాయి.
–సికిందర్, ఎండీ, టెక్నోవిజన్ మొబైల్ స్టోర్