భారీ వర్షాలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదలతో చైనాలో రోడ్లు, బ్రిడ్జీలు కొట్టుకుపోతున్నాయి. ఆకస్మికంగా వచ్చిన వరదలతో శనివారం షాంగ్జీ ప్రావిన్సులో ఓ బ్రిడ్జ్ కూలింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందగా మరో 30 మంది గల్లంతయ్యారు.
జాసుయి కౌంటీలో ఉన్న డానింగ్ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి నదిలో పడ్డ వాహనాల నుంచి ప్రస్తుతానికి 11 మంది మృతదేహాలను వెలికితీసినట్లు చైనా మీడియా పేర్కొంది. ఈ ప్రమాదానికి గురైన మరిన్ని వాహనాల ఆచూకీ ఇంకా తెలియరాలేదని అక్కడి అధికారులు తెలిపారు. కాగాఈ ప్రమాదం పట్ల చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.