ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి.. గంట జర్నీ నిమిషంలోనే

ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి.. గంట జర్నీ నిమిషంలోనే

ఎన్నో భారీ నిర్మాణాలు, ఎత్తైనా కట్టడాల్లో చైనా ముందుంటుంది. లేటెస్ట్ గా ఓ లోయలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన నిర్మించి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది చైనా. 

గుయ్ జౌ ప్రాంతంలో బీపన్ నదిపై రెండు మైళ్ల పొడువున   హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ వంతెనను నిర్మించింది.  ఈ బ్రిడ్జిని 2025 జూన్ లో ప్రారంభించబోతుంది చైనా. ఇది 2050 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా నిలవబోతుంది.

విశేషం ఏంటంటే...2022లో  ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని  ప్రారంభించగా మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. ఈ బ్రిడ్జిని(280మిలియన్ పౌండ్లు) భారత కరెన్సీలో దాదాపు 2400 కోట్లు ఖర్చు చేశారు. ఇది  ఐఫిల్ టవర్ కంటే 200 మీటర్ల ఎత్తు, మూడు రెట్లు ఎక్కువ బరువుతో నిర్మించారు.  అంతేగాకుండా ఈ బ్రిడ్జితో  ఒక గంట పట్టే ప్రయాణాన్ని ఒక నిమిషంలోనే చేరుకోవచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎత్తైన లోయలో ఉన్నఈ బ్రిడ్జి అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఈ బ్రిడ్జి చైనాలోని గ్రామీణ ప్రాంతంలో  రవాణా సౌకర్యంతో పాటు ఈ కొత్త వంతెన ప్రధాన టూరిజం స్పాట్ గా నిలుస్తోంది. ప్రపంచంలోనే  100 ఎత్తైన వంతెనలలో దాదాపు సగం చైనాలోనే ఉండటం విశేషం.