చైనాలో కొత్త వైరస్.. ఆస్పత్రులకు క్యూ.. కరోనా తరహాలో వ్యాప్తి

చైనాలో కొత్త వైరస్.. ఆస్పత్రులకు క్యూ.. కరోనా తరహాలో వ్యాప్తి

చైనా.. మరోసారి భయపెడుతోంది.. వణుకుపుట్టిస్తుంది. కరోనాను అలా మర్చిపోతున్నామో లేదో.. మరో కొత్త వైరస్ పుట్టించేసింది. అవును.. చైనా దేశంలో ఇప్పుడు కొత్త వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉంది.. ఎంతలా అంటే జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఈ వైరస్ పేరు ఏంటో తెలుసా.. HMPV.. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్..ఇది అత్యంత వేగంగా జనానికి వస్తున్నట్లు చెబుతున్నారు.

HMPV లక్షణాలు చూస్తే.. అచ్చం కరోనా తరహాలోనే ఉన్నా.. మరింత డేంజర్ గా ఉందంట ఈ వైరస్. ఒకటి కాదు.. మూడు వైరస్ ల వ్యాప్తి ఉందని ప్రపంచ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో ఈ వైరస్.. అంటు వ్యాధిగా ప్రబలుతుందంట. 

ఈ వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని.. చైనాలోని ఆస్పత్రులు అన్నీ ఫుల్ అయ్యాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నా.. చైనా మాత్రం నోరెత్తటం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్ వో సైతం ఎలాంటి అలర్ట్ ఇవ్వటం లేదు. గతంలో కరోనా వైరస్ సమయంలోనూ ఇలాగే చైనా, డబ్ల్యూహెచ్ వో నిమ్మకనీరెత్తినట్లు వ్యవహరించాయి. ఇప్పుడు కూడా అలాగే కప్పిపుచ్చే విధంగానే వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

Also Read:-బిల్డింగ్ పై విమానం కూలింది.. ఎక్కడంటే..

HMPV.. హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ చిన్న పిల్లలు, వృద్ధుల్లో అధికంగా ఉందని.. కోరింత దగ్గులా ఉందని.. చాలా మంది చనిపోతున్నారనే సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. చైనా ప్రభుత్వం మాత్రం అస్సలు స్పందించటం లేదు. అంతా బాగుంది.. ఈ వైరస్ కామన్ అన్నట్లు వ్యవహరిస్తుందని.. ఏ విషయాన్ని ప్రపంచానికి చెప్పటం లేదనే మిగతా దేశాల వాదన. 

ఏదిఏమైనా కరోనా తరహాలో కొత్త వైరస్ వ్యాప్తి అయితే.. చైనాలో గట్టిగానే ఉందని జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇప్పటికైనా కనీసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేస్తుందో లేదో చూడాలి.