బీజింగ్: తైవాన్‌కు రక్షణ సాయం చేసేందుకు అమెరికా ఆమోదం తెలపడంపై చైనా మండిపడింది. అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తైవాన్‌కు 571.3 మిలియన్‌డాలర్ల రక్షణ సాయం చేసేందుకు అమెరికా అంగీకరించింది. అలాగే, 265 మిలియన్ డాలర్ల విలువైన మిలిటరీ ఆయుధాల విక్రయాలకు అమెరికా విదేశాంగ శాఖ అంగీకరించింది. ఈ నేపథ్యంలో డ్రాగన్‌కంట్రీ స్పందించింది.
తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన చర్యలను అమెరికా వెంటనే ఆపేయాలంటూ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. తైవాన్ అధ్యక్షుడు ‘లాయ్ చింగ్ తె’ ఇటీవల అమెరికాకు చెందిన హవాయి, గువామ్‌లో పర్యటించారు. ఈ చర్య చైనాకు ఆగ్రహం కలిగించింది. ఈ నేపథ్యంలో తైవాన్ చుట్టుపక్కల భారీగా సైన్యాన్ని మోహరించింది. ఈ క్రమంలోనే అమెరికా రక్షణ సాయం ప్రకటన రావడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.