ఇదీ చైనా అంటే..: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన 43 మందిపై జీవితకాల నిషేధం

ఇదీ చైనా అంటే..: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన 43 మందిపై జీవితకాల నిషేధం

శిక్ష అంటే ఎలా ఉండాలి. మరోసారి తప్పు చేయాలన్నా.. అలాంటి ఆలోచన మదిలో మెదలాలన్నా వెన్నులో వణుకు పుట్టాలి. చైనా ఫుట్‌బాల్ సమాఖ్య (CFA) మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి దోషులుగా తేలిన 43 మందికి అచ్చం అలాంటి శిక్షే వేసింది. మరోసారి మైదానంలో కనిపించకుండా జీవితకాల నిషేధం విధించింది.

చైనా దేశవాళీ టోర్నీలో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్‌ జరిగినట్లు ఆరోపణలు రావడంతో రెండేళ్లపాటు విచారణ జరిపిన చైనీస్ ఫుట్‌బాల్ అసోషియేషన్ 43 మందిని దోషులుగా తేల్చింది. వీరిలో 38 మంది ఆట‌గాళ్లు కాగా. నలుగురు క్లబ్  అధికారులు ఉన్నారు. 41 ఫుట్‌బాల్ క్లబ్‌లు పాల్గొన్నట్లు,  120 మ్యాచ్‌లు ఫిక్స్ అయినట్లు దర్యాప్తులో తేలిందని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. మొత్తం 128 మందిని విచారించినట్లు చైనా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read :- మలేషియాను చిత్తు చేసిన భారత్

నిషేధం పడిన 38 మందిలో చైనా మాజీ అంతర్జాతీయ క్రీడాకారులు జిన్ జింగ్‌డావో, గువో టియాన్యు, గు చావో ఉన్నారు.

ద‌క్షిణ కొరియా ప్లేయర్

చైనీస్ సూపర్ లీగ్‌లో షాన్‌డాంగ్ తైషాన్ తరఫున ఆడిన ద‌క్షిణ కొరియా ప్లేయర్ సన్ జున్-హో మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాల్గొని లంచాలు తీసుకున్నాడని చైనీస్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (CFA) ఆరోపించింది.