ఢిల్లీ కంపెనీల లింకులపై ఆరా
బీజింగ్ టుమారో అకౌంట్స్ ఎక్కడ?
హైదరాబాద్, వెలుగు: చైనా గేమింగ్ స్కా మ్ నిందితులను సీసీఎస్ పోలీసులు చంచల్‌గూడ జైల్లో ఉన్న ప్రధాన నిందితుడు యాన్ హూతో పాటు ఢిల్లీకి చెందిన ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీ రజ్ తులిని కోర్టు పర్మి షన్తో 4 రోజుల కస్టడీకి సోమవారం ఉదయం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సెం ట్రల్ క్రైమ్ స్టేషన్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఆధ్వర్యంలో ఇద్దరు ఇన్ స్పెక్టర్ లు, ఎస్ఐల టీం నిందితులను విచారిస్తోంది.
మొదటి రోజు చైనాతో ఢిల్లీ గ్యాంగ్‌కి ఉన్న లింకులను రాబట్టారు. ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేసిన గేమింగ్ కంపెనీలకు చైనా కంపెనీల ప్రతినిధులకు ఉన్న సంబంధాల డీటెయిల్స్ రికార్డ్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేసిన రూ.30 కోట్లతోపాటు ఓవర్సీస్ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రూ.110 కోట్లకు ఆధారాలను సే కరించనున్నారు. గుర్గావ్ హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో చైనా కంపెనీల పేరుతో ఉన్న అకౌంట్స్ వివరాలు కలెక్ట్ చేశారు. దీంతోపాటు బీజింగ్ టు మారో కంపెనీకి చెందిన సౌత్ ఈస్ట్ ఆసియా అధికారిక ప్రతినిధి యాన్ హూ ఇండియాకు ఎప్పుడొచ్చాడు, ఇలాంటి కంపెనీలు ఎన్ని ఏర్పాటు చేశాడనే వివరాలు రికార్డ్ చేస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీకి తీసుకెళ్లి విచారించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.