China Vs US: అమెరికాకు చైనా ఝలక్.. బోయింగ్ జెట్ డెలివరీస్ నిలిపివేత..!

China Vs US: అమెరికాకు చైనా ఝలక్.. బోయింగ్ జెట్ డెలివరీస్ నిలిపివేత..!

Boeing Jets: చైనా మెుదటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్ విషయంలో సీరియస్ గానే ఉంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా టారిఫ్స్ విషయంలో భయపడేదే లేదంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ట్రంప్ మెుదట్లో విధించిన సుంకాలపై ప్రతీకార టారిఫ్స్ చైనా కూడా ప్రకటించటంతో ఈ వివాదం ముదిరింది. చైనా విషయంలో వెనక్కి తగ్గబోనన్న ట్రంప్ అంతే దూకుడుగా చైనాపై సుంకాలను ఏకంగా 145 శాతానికి పెంచారు. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలపై ఇప్పటికే ప్రకటించిన టారిఫ్స్ విషయంలో 90 రోజులు బ్రేక్ ఇచ్చిన ట్రంప్ చైనాపై మాత్రం కనికరం చూపలేదు. వాస్తవానికి ఇది చైనాలోని కంపెనీలను చావుదెబ్బ తీస్తోంది. వందల సంఖ్యలో చిన్న పరిశ్రమలు ప్రస్తుతం తమ వ్యాపారాలను మూసివేసే పరిస్థితికి వచ్చాయని తెలుస్తోంది. చైనా నుంచి అమెరికాకు ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. ట్రంప్ సుంకాల భయంతో చాలా మంది ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకోవటమే దీనికి కారణంగా వెల్లడైంది. 

Also Read :- అంబానీ వ్యూహం సక్సెస్.. జేబులోకి రూ.వెయ్యి కోట్లు, తగ్గేదే లే..

ఇంత జరిగినా చైనా మాత్రం అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోందని తెలుస్తోంది. తాజాగా చైనా బోయింగ్ జెట్స్ డెలివరీని నిలిపివేసినట్లు బ్లూమ్ బెర్గ్ వార్తా సంస్థ నివేదించింది. అలాగే అమెరికా కంపెనీల నుంచి విమానాలకు సంబంధించిన పరికరాలు, విడిభాగాల కొనుగోళ్లను చైనా విమానయాన సంస్థలు నిలిపివేయాలని బీజింగ్ ఆదేశించినట్లు సమాచారం. ఇదే క్రమంలో ప్రస్తుతం బోయింగ్ జెట్‌లను లీజుకు తీసుకుని అధిక ఖర్చులను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు సహాయం అందించే మార్గాలను కూడా చైనా ప్రభుత్వం పరిశీలిస్తోంది.