అగ్రరాజ్యం అమెరికా, చైనా దేశాల మధ్య టెక్ వార్ నడుస్తోంది. ఆయా దేశాల టెక్ కంపెనీలను ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. తాజాగా చైనా ఐఫోన్లలో యూస్ కంపెనీ మెటా సోషల్ మీడియా యాప్స్ వాట్సాప్, థ్రెడ్స్ బ్యాన్ చేసింది. ఆ రెండు యాప్స్ ను యాపిల్ సర్వీసుల నుంచి చైనా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. చైనా అధికారుల ఆదేశాల ప్రకారం ఆ దేశంలోని యాప్ స్టోర్లలో థ్రెడ్స్, వాట్సాప్ యాప్‌లను తీసివేశారు. చైనాలోని ఇంటర్నెట్ రెగ్యులేటర్ సెబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ యాప్ లను తొలగించాలని ఆదేశించినట్లు యాపిల్ కంపెనీ తెలిపింది.
కారణమిదే..
జాతీయ భద్రతకు ప్రమాదం, చైనా సైబర్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్ వాట్సాప్, థ్రెడ్స్ యాప్ లలో ఉన్నందున వాటిని నిషేదింస్తున్నట్లు చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ అన్నారు. ఈ మధ్యకాలంలో చైనా బైట్ డాన్స్ మాతృ సంస్థకు చెందిన టిక్‌టాక్ ను కూడా జాతీయ భద్రతా దృశ్యా బ్యాన్ అమెరికాలో నిషేదిస్తామని బెదిరిస్తుంది. కాగా.. గతనెలలో ఈ నిర్ణయంపై అమెరికా సైనట్ లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. అయితే అమెరికాలో టిక్ టాక్ యూజర్లు మిలియన్లలో ఉన్నారు. కానీ.. చైనాలో వాట్సాప్, థ్రెడ్స్ యాప్ లను అంతంత మాత్రమే ఉపయోగిస్తారు. వాట్సాప్ కు బదులుగా చైనాలో ఆదేశ యాప్ ఉయ్ చాట్ ఎక్కువగా వినియోగిస్తారు. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఐఫోన్లలో మాత్రమే వాట్సాప్, థ్రెడ్స్ యాప్స్ పై చైనా నిషేదం విధించింది.