చైనా షెంజౌ-20 మిషన్ సక్సెస్..సొంత స్పేస్స్టేషన్కు ముగ్గురు వ్యోమగాములు

చైనా షెంజౌ-20 మిషన్ సక్సెస్..సొంత స్పేస్స్టేషన్కు ముగ్గురు వ్యోమగాములు

చైనా తలపెట్టిన షెన్ జౌ20 మిషన్ సక్సెస్ అయింది. తన సొంత స్పేస్స్టేషన్ టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా ముగ్గురు వ్యోమగాములను పంపింది.వాయువ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2F రాకెట్ ను ఏప్రిల్ 24 సాయంత్రం 5.17గంటలకు నింగిలోకి సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది.   

ఈ మిషన్ కు అంతరిక్ష ప్రయాణంలో అనుభవజ్ణుడైన వ్యోమగామి కమాండర్ చెన్ డాంగ్ నాయకత్వం వహించారు. మరో ఇద్దరు వ్యోమగాములు చెన్ జోంగ్రూయ్, వాంగ్ జీలు తొలిసారి అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. ఏప్రిల్ 29న భూమికి తిరిగా రావాల్సిన షెన్ జౌ19 సిబ్బందిని వీరు రీప్లేస్ చేస్తారు. షెన్ జౌ 20 మిషన్ లో భాగంగా కొన్ని గంటల తర్వాత చైనా అంతరిక్ష స్పేస్ స్టేషన్ టియాగాంగ్ తో డాకింగ్ చేసిన తర్వాత సిబ్బంది తన కార్యకలాపాలు ప్రారంభిస్తారు. 

అధిక ఉష్ణోగ్రత సూపర్ కండక్టర్లు, ప్లాట్ వార్మ్ లను ఉపయోగించి కణజాల పునరుత్పత్తి, మెదడు ఆర్గనాయిడ్ నమూనాలపై ప్రయోగాలు చేయనున్నారు. దీనిద్వారా అంతరిక్షంలో నాడీ ఆరోగ్యంపై అధ్యయనం చేస్తారు. సూక్ష్మ గురుత్వాకర్షణకు జీవసంబంధమైన ప్రతిస్పందనలను అన్వేషించేందుకు జీబ్రాఫిష్, సూక్ష్మజీవుల ప్రయోగాలను పర్యవేక్షించనున్నారు.

1999లో షెన్ జౌ అంతరిక్ష కార్యక్రమాలను చైనా ప్రారంభించింది. ఈ మిషన్ 20వది. 2022 నుండి పనిచేస్తున్న టియాంగాంగ్ స్టేషన్ చంద్రునిపై పరిశోధనలు,దీర్ఘకాలిక అంతరిక్ష పరిశోధనల కోసం చైనా అధ్యయనాలకు కేంద్రంగా ఉంది.షెన్‌జౌ-20 సిబ్బంది అక్టోబర్ చివరిలో భూమికి తిరిగి వస్తారని అంచనా వేస్తున్నారు.

2026 నుంచి ప్రారంభమయ్యే చైనా మిషన్ల కోసం హాంకాంగ్ ,మకావు అభ్యర్థులతో సహా దాని నాల్గవ వ్యోమగామి బృందానికి శిక్షణ ఇస్తోంది.చైనా సహకారంతో పాకిస్తాన్ భవిష్యత్ చైనా మిషన్ల కోసం వ్యోమగాములను సిద్ధం చేస్తోంది. మే 2025 నాటికి 5-10 మంది వ్యక్తుల షార్ట్‌లిస్ట్ నుంచి ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. యాంగాంగ్‌లోని శాస్త్రీయ పేలోడ్‌లపై దృష్టి సారించి పాకిస్తానీ వ్యోమగామి అక్టోబర్ 2026 నాటికి అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.