
బీజింగ్: మంకీపాక్స్ కట్టడికి చైనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఆ దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీ సినోఫార్మ్ 'ఎంపాక్స్' పేరిట మంకీపాక్స్‌కు వ్యాక్సిన్ డెవలప్ చేసింది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉంది. ఇప్పటికే అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, రష్యాలో మంకీపాక్స్ టీకా అందుబాటులో ఉంది. అయితే, చైనా నుంచి తయారవుతున్న మొదటి వ్యాక్సిన్ 'ఎంపాక్స్' మాత్రమే. దీనికి 3 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. ట్రయల్స్ సక్సెస్ అయితే చైనాలో త్వరలోనే ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.