సెలవులు లేకుండా పనిచేసి ఓ కంపెనీకి చెందిన ఉద్యోగి మృతిచెందిన ఘటనలో చైనాకు చెందిన కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మృతిని కుటుంబానికి రూ. 47 లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..
తూర్పు చైనాలో అబావో అనే కార్మికుడు అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే అబావో మరణానికి కంపెనీయే కారణమని అతని కుటుంబసభ్యులు కోర్టుకెక్కారు. కేవలం ఒక రోజు మాత్రమే విశ్రాంతి తీసుకొని 104 రోజులు ఏకధాటిగా పనిచేయడం వల్లే అబావో చనిపోయాడని వాదించారు. అవయవ వైఫల్యంతో అబావో అనే30 ఏళ్ల వ్యక్తి మరణించిన తర్వాత.. ఎక్కువ పని చేసే చైనీస్ పని సంస్కృతిపై ఆందోళనలు వెల్లువెత్తాయి.
ALSO READ | లక్నోలో కూలిన భవనం.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు
దీంతో అబావో మరణానికి కంపెనీ 20 శాతం కారణమని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని కోర్టు తీర్పునిచ్చింది. అబావో తరచుగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో బాధ పడుతూ న్యుమోకాకల్ ఇన్ఫెక్షన్ కారణంగా అతని శరీరంలోని చాలా అవయవాలు పూర్తిగా దెబ్బతినడం వల్ల అబావో మరణించాడని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటన చైనాలో ఆందోళనలు రేకెత్తించింది. దేశంలో కార్మికులపట్ల యాజమాన్యం తీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
అయితే అబావో పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం పైకోర్టు అయిన జౌషాన్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టుకు వెళ్లింది.. ఈ కోర్టుకూడా కిందికోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.