షెన్జెన్ (చైనా): ఇండియా డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి మళ్లీ రాకెట్లు పట్టేందుకు రెడీ అయ్యారు. సాత్విక్ భుజానికి గాయం కావడంతో పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ జోడీ ఒక్క ఈవెంట్లోనూ బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి జరిగే చైనా మాస్టర్స్‌లో మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్ జోడీ ఈ సారి టైటిల్‌పై దృష్టి పెట్టింది. తొలి రౌండ్లో ఇండియా జంట.. యాంగ్ పో సున్–లీ జి హుయ్ (చైనీస్‌తైపీ)తో తలపడుతుంది. ఇతర స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ కూడా ఫామ్‌లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆడిన రెండు టోర్నీల్లోనూ ఈ ఇద్దరు ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగారు. లక్ష్యసేన్.. లీ జి జియా (మలేసియా)తో, సింధు.. సుపానిదా (థాయ్‌లాండ్) ఆట మొదలుపెట్టనున్నారు.