మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో అనుపమ సంచలనం

మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో అనుపమ సంచలనం

షెంజెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : చైనా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా యంగ్ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుపమ ఉపాధ్యాయ సంచలన విజయంతో ఆరంభించింది.  తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రపంచ 15వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీవెన్ జాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చింది. మంగళవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 19 ఏండ్ల అనుపమ 21–17, 8–21, 22–20తో అమెరికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 750 ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండో రౌండ్ చేరుకుంది. 

మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి–సిక్కి రెడ్డి తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 23–21, 17–21, 21–17తో అమెరికాకు చెందిన ప్రెస్లే స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–జెనీ గైపై గెలిచి రెండో రౌండ్ చేరారు. కానీ, మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రియాన్షు రజావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21–22, 13–21, 18–21తో చికో ఆరా వర్డొయో (ఇండోనేసియా), విమెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆకర్షి కశ్యప్ 10–21, 18–21తో మియాజకి (జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడి తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి పట్టారు.