క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌..సింధు ఇంటికి

క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌..సింధు ఇంటికి

షెన్‌‌‌‌‌‌‌‌జెన్ (చైనా) : చైనా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే  ఓడి ఇంటిదారి పట్టగా.. మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌, డబుల్స్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌–చిరాగ్ షెట్టి  క్వార్టర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరుకున్నారు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో లక్ష్య 21–6, 21–16తో వరుస గేమ్స్‌‌‌‌‌‌‌‌లో డెన్మార్క్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాస్మస్‌‌‌‌‌‌‌‌ గెమ్కేను చిత్తు చేశాడు. క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సేన్‌‌‌‌‌‌‌‌.. డెన్మార్క్‌‌‌‌‌‌‌‌కే చెందిన మూడో సీడ్ ఆండర్స్‌‌‌‌‌‌‌‌ ఆంటోన్సెన్‌‌‌‌‌‌‌‌తో తలపడనున్నాడు. డబుల్స్ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్ జంట 21–19, 21–15తో  రాస్మస్‌‌‌‌‌‌‌‌ కయెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఫ్రెడెరిక్‌‌‌‌‌‌‌‌ సొగార్డ్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌)పై గెలిచింది.  

కానీ,  విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో 19వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సింధు 16–21, 21–17, 21–23తో యెయో జియా మిన్ (సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేతిలో మూడు గేమ్స్‌‌‌‌‌‌‌‌ పాటు పోరాడి ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అనుపమ ఉపాధ్యాయ 7–21, 14–21తో నత్సుకి నిదైరా (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో, మాళవిక బన్సొద్‌‌‌‌‌‌‌‌ 9–21, 9–21తో ఎనిమిదో సీడ్ సుపానిద కాటెథాంగ్‌‌‌‌‌‌‌‌ (థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌) చేతిలో చిత్తయ్యారు. డబుల్స్‌‌‌‌‌‌‌‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ జంట 16–21, 11–21తో  రెండో సీడ్‌‌‌‌‌‌‌‌ లియు షెంగ్‌‌‌‌‌‌‌‌ షు–టాన్ నింగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది.