
షెన్‌జెన్(చైనా): చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. శనివారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీస్‌లో సాత్విక్– చిరాగ్ 18–-21, 21–-14, 16–-21తో అన్‌సీడెడ్ కొరియా ప్లేయర్లు జిన్ యాంగ్– సియో సెయుంగ్ చేతిలో మూడు గేమ్స్ పాటు పోరాడి ఓడిపోయారు. 74 నిమిషాల ఆటలో తొలి గేమ్‌ను చేజార్చుకున్న ఇండియా ప్లేయర్లు రెండో గేమ్‌లో నెగ్గి మ్యాచ్‌లో నిలిచారు. కానీ, మూడో గేమ్‌లో పేలవంగా ఆడి టోర్నీ నుంచి వైదొలిగారు.