షెన్‌జెన్ (చైనా) : ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్.. చైనా మాస్టర్స్ సూపర్–750 టోర్నీలో బోణీ చేశారు. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21–17, 21–19తో బుసానన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. దీంతో థాయ్ ప్లేయర్‌తో తలపడిన 21 సార్లలో తెలుగు షట్లర్‌కు ఇది 20వ విజయం కావడం విశేషం. 50 నిమిషాల మ్యాచ్‌లో ఇద్దరు షట్లర్ల మధ్య ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. తొలి గేమ్‌లో ఓ దశలో సింధు 10–10తో ఉన్న దశలో రెండు అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేయడంతో బుసానన్ 14–10తో లీడ్‌లోకి వచ్చింది.
వెంటనే తేరుకున్న సింధు వరుసగా 9 పాయింట్లతో 19–14తో ముందుకెళ్లింది. రెండో గేమ్‌ను మరింత బలంగా మొదలుపెట్టిన బుసానన్ చకచకా పాయింట్లతో లీడ్‌లోకి వచ్చింది. దీంతో 18–17 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక 20–20 ఉన్న దశలో సింధు రెండు స్మాష్‌లతో గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో మాల్విక బన్సోద్ 20–22, 23–21, 21–16తో లైన్ హోమార్క్ కెర్స్‌ఫెల్ట్ (ఇండోనేసియా)పై గెలిచింది.
మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21–14, 13–21, 21–13తో ఏడోసీడ్ లీ జి జియా (మలేసియా)పై సంచలన విజయం సాధించాడు. విమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ 21–15, 21–14తో హు లింగ్ ఫెంగ్–జెంగ్ యు చీ (చైనీస్‌తైపీ)పై నెగ్గారు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్12–21, 21–19, 21–18తో లీ జి హుయ్–యాంగ్ పో హుసాన్ (చైనీస్‌తైపీ) నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.