చైనా ఓపెన్‌‌‌‌ లో ప్రియాన్షురజావత్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లోనే ఔట్‌‌‌‌

చాంగ్జౌ (చైనా): ఇండియా యంగ్ షట్లర్ ప్రియాన్షు రజావత్ చైనా ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌1000 టోర్నమెంట్‌‌‌‌లో నిరాశపరిచాడు. మెన్స్ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లోనే ఇంటిదారిపట్టాడు. మంగళవారం జరిగిన తొలి పోరులో ప్రియాన్షు 13–21, 16–21తో కెనడాకు  చెందిన బ్రియాన్​ యాంగ్‌‌‌‌ చేతిలో వరుస గేమ్స్‌ లో ఓడిపోయాడు.