జాక్ మా కంపెనీలన్నీ చైనా సర్కారు ఆధీనంలోకి
నేషనలైజ్ చేద్దామనుకుంటున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: చైనీస్ బిలీనియర్ జాక్ మాకు చెందిన కంపెనీలు అలీబాబా, యాంట్ గ్రూప్‌లను చైనీస్ ప్రభుత్వం నేషనలైజ్ చేయాలని చూస్తోంది. కంపెనీ మోనోపలి కార్యకలాపాలపై ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. ఈ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగానే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యాంట్ గ్రూప్‌ను, అలీబాబాను నేషనలైజ్ చేయాలనుకుంటోంది. కమ్యూనిస్ట్ పార్టీలో టాప్ వ్యక్తుల నుంచే అలీబాబాను నేషనలైజ్ చేసే విషయం బయటికి వచ్చిందని ఐబీ టైమ్స్ రిపోర్ట్ చేసింది. చైనా రెగ్యులేటర్, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లపై అక్టోబర్ 24న షాంఘైలో జరిగిన ఒక సమిట్‌లో జాక్ మా కీలక వ్యాఖ్యలు చేశారు. రెగ్యులేటరీ సిస్టమ్ ఇన్నొవేషన్‌కు అడ్డుకట్ట వేస్తోందని, గ్రోత్‌కు కొత్త రెగ్యులేటరీ రీఫామ్ కావాలని 2020 చెప్పారు. జాక్ మా వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత జాక్ మా యాంట్ గ్రూప్ ఐపీఓను చైనా రెగ్యులేటరీ ఆపేసింది.ఈ కంపెనీలపై స్క్రూటినీ పెంచింది. దీంతో అలీబాబా షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. కాగా, జాక్ మా అక్టోబర్ నుంచి కనిపించకుండా పోయారు.
ఇవీ చదవండి..