
మిడతలపై పోరుకు బాతులు
20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పాకిస్తాన్‌లో మిడతలు దాడి చేస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. అక్కడి నుంచి భారత సరిహద్దు రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్‌లోనూ ప్రవేశించి లక్షల ఎకరాల్లోని పంటను నాశనం చేశాయి. మిడతలపై పోరుకు పాకిస్తాన్‌కు సాయం చేయనున్నట్లు చైనా ప్రకటించింది. ఆ దేశానికి లక్ష బాతులను పంపించనున్నట్లు చైనా మీడియా పేర్కొంది. ఇంతకుముందు చైనాలో ఇలాగే మిడతలు దాడి చేస్తే… ఆ దేశం ‘‘డక్ ఆర్మీ’’ని రంగంలోకి దించింది. మంచి ఫలితాలు రావడంతో బాతులను పెంచుతోంది. పెస్టిసైడ్స్ వాడితే పర్యావరణం దెబ్బతినడంతో పాటు ఖర్చు ఎక్కువవుతుందని, బాతులను వాడటమే
మేలని సైంటిస్టులు అంటున్నారు. ఒక్క బాతు రోజుకు 200 మిడతలను తింటుందని, కోడి 70 మాత్రమే తినగలదని చెబుతున్నారు.
For More News..