Paris Olympics 2024: ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టిన ఆనందంలో.. కోర్టులోనే టీమ్‪మెట్‌కు లవ్ ప్రపోస్

Paris Olympics 2024: ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టిన ఆనందంలో.. కోర్టులోనే టీమ్‪మెట్‌కు లవ్ ప్రపోస్

పారిస్  ఒలంపిక్స్ వేదికగా ఓ ప్రేమ జంట ఒక్కటైంది.  చైనా బ్యాడ్మింటన్ మిక్సిడ్ డబుల్స్ జోడి ఆగస్ట్ 2న గోల్డ్ మెడల్ సాధించింది. విజయం సాధించిన సందర్భంగా హువాంగ్ యాకియోంగ్‌ ఆమె ప్రియురాలు లియు యుచెన్ కు వెడ్డింగ్ రింగ్ తొడిగి లవ్ ప్రపోస్ చేశాడు. పారిస్ ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ పోటీలు జరిగే లా చాపెల్లే అరేనా స్టేజ్ మొత్తం ఆశ్చర్యానికి గురైయ్యారు. హువాంగ్ యాకియోంగ్ ప్రపోజల్ కు లియు ఓకే చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ కేరింతలతో మారుమోగిపోయింది. హువాంగ్ చూపించిన ప్రేమకి లియు తల ఊపి.. ఆనందభాష్పాలతో పొంగిపోయింది.

టోక్యో ఒలంపిక్స్ లో లియు.. ఔ జువాన్ తో కలిసి రజిత పతకాన్ని సాధించింది. ఈ సారి ఔ జువాన్ ఒలంపిక్స్ కు సెలక్ట్ కాలేదు. హువాంగ్ యాకియాంగ్ తో పారిస్ ఒలంపిక్స్ ఆడి లియు గోల్డ్ మెడల్ గెలుచుకుంది. లియు సంతోషాన్ని వర్ణించలేనని.. ఒలింపిక్ ఛాంపియన్‌గా మారడానికి  ఆమె ప్రాక్టీస్ పై ఫోకస్ పెట్టడం వల్ల అతనిని గమనించలేదని చెప్పింది. స్టేజ్ పైనే ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడగడం లియుకు సర్ ప్రైజ్ కలిగించిందని తెలిపింది.