బీజింగ్: ట్రాన్స్‌పోర్టేషన్‌లో కొత్త కొత్త టెక్నాలజీలు ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాయి. ట్రైన్ల విషయంలో ఇప్పటి వరకు బుల్లెట్ ట్రైన్ మాత్రమే అత్యంత ఫాస్ట్.. హయ్యెస్ట్ స్పీడ్ వెళ్లే బుల్లెట్ ట్రైన్లు జపాన్‌లో ఉన్నాయి. ఇవి గంటకు 500 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో ప్రయాణించగలవు. అయితే ఇప్పుడు చైనా కొత్తగా ‘మ్యాగ్లెవ్’ ట్రైన్‌ను ఆవిష్కరించింది. ఇది గంటలకు 600 కిలోమీటర్ల మ్యాగ్జిమం స్పీడ్‌తో ప్రయాణించగలదు. చైనాలోని కోస్టల్ సిటీ క్వింగ్డావోలో దీనిని తయారు చేసినట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. ఈ ట్రైన్ చైనాలోని బీజింగ్ నుంచి షాంఘైకు వెయ్యి కిలో మీటర్ల దూరాన్ని రెండున్నర గంటల్లోపే చేరుకోగలదని పేర్కొంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్లో ఈ దూరం ప్రయాణించాలంటే ఐదున్నర గంటల టైమ్ పడుతుంది. అదే ఫ్లైట్‌లో వెళ్లాలంటే 3 గంటలు ప్రయాణించాలి. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌లో రైలు పట్టాలను టచ్ చేయకుండానే దూసుకెళ్తుంది. విద్యుదయస్కాంత శక్తి (ఎలక్ట్రోమయాగ్నెటిక్ ఫోర్స్) ద్వారా ట్రాక్‌కు కొంచెం ఎత్తులో రైలు హైస్పీడ్‌తో ప్రయాణిస్తుంది. దాదాపు 20 ఏండ్లుగా మ్యాగ్లెవ్ టెక్నాలజీని వాడుతోంది. చైనాలోని ఒక ఎయిర్ పోర్టు నుంచి షాంగైకి ఎప్పటి నుంచి ఈ మ్యాగ్లెవ్ ట్రాన్స్పోర్ట్ ఉంది. అయితే ఇంకా చైనాలో ఏ రెండు సిటీలు, రాష్ట్రాల మధ్య ఈ ట్రాక్‌లు పూర్తి స్థాయిలో లేవు. షాంగై, చెంగ్డూతో పాటు మరికొన్ని సిటీలు మ్యాగ్లెవ్ ట్రైన్ రీసెర్చ్ కోసం ట్రాన్‌ను సిద్ధం చేస్తున్నాయి. త్వరలో దీని కావాల్సిన పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెద్ద పెద్ద సిటీల మధ్య నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.
గంటకు 600 కిలోమీటర్ల స్పీడ్.. పట్టాలకు టచ్ కాకుండా దూసుకెళ్లే ట్రైన్
- విదేశం
- July 22, 2021
లేటెస్ట్
- WPL 2025: ఆర్సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్
- తెలంగాణలో 90 శాతం వెనుకబడిన వాళ్లే: రాహుల్ గాంధీ
- మేకిన్ ఇండియాతో ఒరిగిందేం లేదు..మోదీ పూర్తిగా విఫలం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ల బుకింగ్ ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండి
- ENG v AUS: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'.. షేన్ వార్న్‌ను గుర్తు చేసిందిగా
- V6 DIGITAL 03.02.2025 AFTERNOON EDITION
- సామూహిక అక్షరాభ్యాసాలు.. కిటకిటలాడిన దేవాలయాలు
- భారతీయులే టాప్.. యూఎస్‌కు అక్రమ వలసల్లో ఆసియా నుంచి మనవాళ్లే అధికం
- SankranthikiVasthunam: బాక్సాఫీస్‌కి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన విక్టరీ.. సంక్రాంతికి వస్తున్నాం రికార్డు వసూళ్లు
- గోవాలో ‘కబాలి’ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
Most Read News
- కిమ్స్‌లో ఇంకెన్నాళ్లు ఇలా..? శ్రీతేజ్‌ను కాపాడుకునేందుకు అల్లు అర్జున్ బిగ్ డెసిషన్
- మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడా..?
- రథసప్తమి విశిష్టత .. ప్రాముఖ్యత ఇదే.. ఆరోజు ఏంచేయాలి
- Womens U19 T20 World Cup: అమ్మ, నాన్న నన్ను క్షమించండి: సౌతాఫ్రికా కెప్టెన్ ఎమోషనల్
- ఇది కదా కావాల్సింది.. బంగారం రేటు తగ్గిందండోయ్.. హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే..
- తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..
- Ratha Saptami : రథ సప్తమి ఎందుకు జరుపుకుంటారు.. జిల్లేడు ఆకుతో స్నానం విశిష్ఠత ఏంటీ..!
- హైదరాబాద్ సిటీలో మెట్రో సౌండ్ వార్ .. ప్రజావాణిలో బోయిగూడవాసుల ఫిర్యాదు
- Thandel ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లని Allu Arjun.. లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్.. రీజన్ ఇదే..
- గౌరవంగా మరణించే హక్కు కల్పించిన ప్రభుత్వం.. ప్రశంసించిన వెటరన్ హీరోయిన్..