వేములవాడ, వెలుగు: రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తే సీఎం కేసీఆర్కలవకపోవడం కరెక్ట్కాదని ఆర్టీసీ మాజీ చైర్మన్గోనె ప్రకాశ్‌రావు అన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికే నష్టమని చెప్పారు. సోమవారం వేములవాడలో ప్రకాశ్‌రావు మీడియాతో మాట్లాడారు. గతంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ ఆమోదం తెలిపిందని, మరి ఇప్పుడెందుకు విభేదాలొచ్చాయని ప్రశ్నించారు. చినజీయర్ స్వామి వల్లనే మోదీకి.. కేసీఆర్ దూరయ్యారన్నారు.ప్రొటోకాల్ప్రకారం ప్రధానిని కలిస్తే.. నిధులు, రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారి ఇప్పటివరకు ఏం సాధించిందని ప్రశ్నించారు. ఎంపీ సంతోశ్‌కుమార్ తన స్వగ్రామం కొదురుపాకకు వస్తే చుట్టు పక్కల గ్రామాల్లో ముందస్తుగా అరెస్టులు చేయించడం దేనికన్నారు. గవర్నర్ వ్యవస్థను కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్సీ పదవులు కేవలం కవులు, కళాకారులు, సమాజ సేవ చేసే వారికే ఇవ్వాలని చట్టం చెబుతోందన్నారు. 2013 నుంచి తాను ఏ పార్టీలో లేనని, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాని తెలిపారు.