‘మేడ్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని దెబ్బ కొట్టేందు చైనా భారీ ప్లాన్

 ‘మేడ్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని దెబ్బ కొట్టేందు చైనా భారీ ప్లాన్

ప్రపంచ వ్యాప్తంగా ఇండియాకు పెరుగుతున్న మద్ధతు చూసి చైనా జీర్ణించుకోలేక పోతోంది. ఇండియాలో ఉన్న మ్యాన్ పవర్ కారణంగా..  చైనా అనుసరిస్తున్న విధానాల రీత్యా.. మల్టీ నేషనల్ కంపెనీలు ఇండియాలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. యాపిల్ లాంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ఇండియా నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. ‘మేడ్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి మద్ధతుగా ఇండియాలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది యాపిల్ కంపెనీ. 

యాపిల్ కంపెనీ ఉత్పత్తులను చైనాలో ఫాక్స్ కాన్ కంపెనీ తయారు చేసేది. అయితే చైనా నుంచి ఇడియాకు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను మార్చాలనుకుంటున్న క్రమంలో అడ్డుకోవాలని చైనా చూస్తోంది. అందుకోసం టెక్నాలజీ, మ్యాన్ పవర్ ను ఇండియాకు ట్రాన్స్ ఫర్ కాకుండా అడ్డుకుంటోంది. అందుకోసం కఠినమైన రిస్ట్రిక్షన్స్ విధిస్తోందట. ఫాక్స్ కాన్ కంపెనీలో పనిచేసే టెక్నికల్ టీమ్ ను, ఉద్యోగులను ఇండియాకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అదే విధంగా ఆసియా దేశాలకు కంపెనీలు తరలి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేసే యోచనలో ఉందని తెలిసింది. ఇవే కాకుండా మున్ముందు చాలా కంపెనీలు ఇండియాకు తరలి వెళ్లనున్నట్లు తెలుసుకున్న చైనా.. ఎలాగైనా ఆపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Also Read : ఆందోళనలో H1B వీసాహోల్డర్లు!

తమ దేశంలో ప్రొడక్షన్ పెంచేందుకు, ఉద్యోతాలు తగ్గకుండా చూసుకునేందుకు.. వీటితో పాటు ఫారెన్ ఇన్వెస్టర్లను ఇండియా లాంటి దేశాలకు వెళ్లకుండా చేసేందుకు రెగ్యులేటరీ ఏజెన్సీలను అలర్ట్ చేసిందని అంతర్గత సమాచారం. 

ఖండించిన చైనా:

తమపై వస్తున్న  ఆరోపణలను చైనా ఖండించింది. విదేశీ కంపెనీలను అడ్డుకోవాలనే ఆలోచన తమకు లేదని తెలిపింది. తమ దేశానికి వచ్చే కంపెనీలను, పెట్టుబడి దారులను ఎప్పటికీ ఆహ్వానిస్తామని, చైనాలో పెట్టుబడులకు సులభతరమైన విధానాలను అమలు చేస్తామని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.