Video Viral: పులుసులో యూరిన్​.. ఓ రెస్టారెంట్​ నిర్వాకం

Video Viral: పులుసులో యూరిన్​..  ఓ రెస్టారెంట్​ నిర్వాకం

 చైనాలో రోజుకొక కొత్త ఆచారం .. రోజుకొక వెరైటీ ఫుడ్​.. ఆ టేస్టే వేరు.. అందుకే ప్రపంచవ్యాప్తంగా చైనా రెస్టారెంట్లు అంటే జనాలు పడి చస్తారు.  వారు దేనితో తయారు చేస్తారో తెలియదు కాని ... లొట్టలేసుకొని తింటారు.. కాని ఈ వీడియోను చూస్తే.. ఇక ఈ జన్మలో.. కాదు.. కాదు  ఏ జన్మలోనైనా చైనాఫుడ్​ను బాయ్​కాట్​ చేస్తారు... ఇంతకూ ఆఫుడ్​లో ఏముందంటే ..

చైనాలో పాపులర్​ రెస్టారెంట్​ అయిన హైదిలావ్​లో పులుసులో మూత్రం ( యూరిన్​) కలుపుతున్నారు.. కలపడం అంటే కలపడం కాదు.. చైనాలోని షాంఘై శివారు ప్రాంతంలోని హైదిలాస్​ రెస్టారెంట్​లో పులుసు ఉడుకుతుండగా   ఇద్దరు పురుషులు  మూత్ర విసర్జన చేస్తున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.  

ఈ ఘటన ఫిబ్రవరి 24 వ తేదీన జరగ్గా..  మార్చి6 వ తేదీన ఘటన జరిగిన ప్రదేశాన్ని నిర్దారించారు.  మొదట ఈ వివరాలను చెప్పేందుకు ఇబ్బంది పడిన  హైదిలావ్​ రెస్టారెంట్​ యాజమాన్యం  తరువాత ఇది కరక్టేనని ధృవీకరిస్తూ.. సిబ్బంది లోపం వలన జరిగిందని అంగీకరించింది. 

Also Read : స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..?

పులుసులో మూత్రం కలవడం వలన హైదిలావ్​ కస్టమర్లకు కలిగిన బాధను తాము తీర్చలేమని ..ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని ప్రకటించింది.   4 వేల మంది బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని హైదిలావ్​ యాజమాన్యం తెలిపింది.  అయితే ఎంత పరిహారం ఇస్తారో వెల్లడించలేదు. ఈఘటనపై    జియాన్‌యాంగ్, సిచువాన్ లో రెస్టారెంట్ల మెయిన్​ బ్రాంచ్ లు.. ఇంకా హైదిలావ్​ రెస్టారెంట్లు ఉన్నచోట్ల పోలీసులు ఆరా తీస్తున్నారని UK మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ కేసులో షాంఘై పోలీసులు  అనుమానిస్తున్న 17 ఏళ్ల ఇద్దరు యువకులను  అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై  కంపెనీ  సివిల్ దావాను కోర్టులో  దాఖలు చేసింది.

హైదిలావ్  రెస్టారెంట్​ 1994 లో చైనాలోని  సిచువాన్ అనే చిన్న గ్రామంలో స్థాపించారు.  ఆ తరువాత చైనీస్​ వంటకాలతో బ్రాండ్​ గా మారడంతో 2023 జూన్​ నాటికి   ప్రపంచవ్యాప్తంగా 1400 రెస్టారెంట్లకు పైగా ప్రారంభించింది.  చైనాలో   హైదిలావ్​ రెస్టారెంట్లు 1360 ఉన్నాయి.  సింగపూర్, యుఎస్, కెనడా, యుకె , ఆస్ట్రేలియాతో సహా 14 దేశాలలో 122 హైదిలావ్ అవుట్‌లెట్‌లను నిర్వహిస్తోంది.