పిల్లల్ని కనండయ్యా ప్లీజ్..! వరుసగా మూడో ఏడాది తగ్గిన చైనా జనాభా

పిల్లల్ని కనండయ్యా ప్లీజ్..! వరుసగా మూడో ఏడాది తగ్గిన చైనా జనాభా

బీజింగ్: భారత పొరుగు దేశం చైనాలో వరుసగా మూడవ ఏడాది జనాభా తగ్గింది. గడిచిన రెండు సంవత్సరాల కంటే 2024లో జననాలు సంఖ్య కాస్త పెరిగినప్పటికీ.. ఓవరాల్‏గా దేశ జనభా మాత్రం వరుసగా మూడవ ఏడాది తగ్గినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. 2024 పాపులేషన్‎కు సంబంధించిన గణంకాలను చైనా నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో 2025, జనవరి 17వ తేదీన విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2024లో చైనా జనాభా 1.39 మిలియన్లు తగ్గి దేశ జనభా మొత్తం 1.408 బిలియన్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. 

2024లో సుమారు 9.54 మిలియన్ల మంది పిల్లలు జన్మించారు. ఈ సంఖ్య 2023 జననాల రేటుతో పోలిస్తే కాస్త పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. చైనీస్ రాశిచక్రంలోని డ్రాగన్ సంవత్సరం పిల్లలను కనేందుకు అదృష్టమని ప్రజలు భావించడంతోనే 2024లో జననాల సంఖ్య కాస్త పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది మళ్లీ చైనాలో జననాల రేటు తగ్గే అవకాశం ఉందని వారు అంచనా వేశారు. చైనాలో పుట్టిన కొవిడ్ వైరస్ ప్రపంచదేశాలను గజగజ వణికించిన విషయం తెలిసిందే. కొవిడ్ సృష్టించిన ప్రళయానికి కొన్ని నెలల పాటు ప్రపంచం స్తంభించిపోయింది.

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా మహ్మమారి కుప్పకూల్చింది. దాదాపు మూడేళ్ల పాటు కొవిడ్ ప్రజలపై ప్రభావం చూపింది. కొవిడ్ తాండవం చేసిన ఈ మూడేళ్లు చైనా ప్రజలు పిల్లలకు జన్మనిచ్చేందుకు ఆసక్తి చూపలేదని.. అప్పుడు సంతానాన్ని వాయిదా వేసుకున్న వారు 2024లో పిల్లలకు జన్మనిచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించారని.. అందుకే 2024లో మునుపటి కంటే కాస్త జననాల రేటు పెరిగిందని జనాభా శాస్త్రవేత్త హీ యాఫు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే.. 2025లో నవజాత శిశువుల సంఖ్య తగ్గుతుందని ఆయన అంచనా వేశారు. 

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో కట్టడి కోసం చైనా కఠిన నిబంధలు అమలు చేసింది. ఒకే కుటుంబానికి ఒకే బిడ్డ నిబంధనలు అమలు చేసి జనభా పెరుగుదలను మెల్లగా కట్టడి చేసింది. దీంతో దేశంలో యువత తగ్గిపోయి వృద్ధులు ఎక్కువ అయ్యారు. ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దేశంలో యువత తగ్గిపోవడంతో శ్రామిక రంగం గణనీయమైన ఒత్తిడికి గురైంది. 

Also Read : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్లు

దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం పడిపోతున్న జనన రేటును పెంచేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఒక కుటుంబానికి ఒక బిడ్డ వంటి విధానాన్ని సడలించింది. అలాగే పిల్లలను కనాలని దేశ జనాభాను ప్రోత్సహించింది. ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలకు గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ,  ఉపాధి కల్పన వంటి హామీలు ఇచ్చి పడిపోతున్న జననాల రేటును పెంచేందుకు చర్యలలు తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తోన్న ఎక్కువ మంది పిల్లలను కనేందుకు జనాభా ఇంట్రెస్ట్ చూపించకపోవడం గమనార్హం.