WI vs NZ T20 T20 World Cup 2024: తలకు తగిలిన బంతి.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన విండీస్ క్రికెటర్

WI vs NZ T20 T20 World Cup 2024: తలకు తగిలిన బంతి.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిన విండీస్ క్రికెటర్

మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బాధాకర సంఘటన జరిగింది. శుక్రవారం (అక్టోబర్ 18) షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ చినెల్లే హెన్రీ తలకు గాయమైంది. డాటిన్ వేసిన ఇన్నింగ్స్ 12 వ ఓవర్లో న్యూజిలాండ్ బ్యాటర్ అమేలియా కెర్ భారీ షాట్ ఆడింది. టైమింగ్ సరిగా కుదరకపోవడంతో బంతి లాంగాన్ దిశగా వెళ్ళింది. బంతి బాగా గాల్లోకి లేవడంతో లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న హెన్రీ క్యాచ్ పట్టడానికి ముందుకు వచ్చింది. 

క్యాచ్ పడదామని రెండు చేతులు చాపింది. బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో అది వచ్చి ఆమె తల ముందర భాగంలో  బలంగా తగిలింది. దీంతో ఈ విండీస్ ప్లేయర్ అక్కడికక్కడే కుప్పకూలింది. ఫ్లడ్ లైట్స్ ఆమె కళ్ళలో పడిన కారణంగా ఆమె క్యాచ్ అందుకోలేకపోయి ఉండవచ్చని తెలుస్తుంది. ఫిజియో వచ్చి ఆమెను మైదానం నుండి బయటకు తీసుకెళ్లాడు. కీలకమైన సెమీ ఫైనల్లో హెన్రీ బ్యాటింగ్ కు దిగలేదు. బౌలింగ్ లో నాలుగు ఓవర్ల స్పెల్ పూర్తి చేసి 24 పరుగులు మాత్రమే ఇచ్చింది. 

Also Read : కెప్టెన్‌గా బాబర్ అజామ్ రాజీనామా

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న న్యూజిలాండ్‌.. విమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. బ్యాటింగ్‌లో జార్జియా ప్లిమర్‌ (33), సుజీ బేట్స్‌ (26), బౌలింగ్‌లో ఈడెన్‌ కార్సన్‌ (3/29) రాణించడంతో.. శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో కివీస్‌ 8 రన్స్‌ తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 128/9 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 120 పరుగులకే పరిమితమైంది.