చైనా నటుడు కిడ్నాప్..సైబర్ స్కామ్ సెంటర్లలో అతనితో ఏం చేయించారు?

చైనా నటుడు కిడ్నాప్..సైబర్ స్కామ్ సెంటర్లలో అతనితో ఏం చేయించారు?

చైనా యువ నటుడు వాంగ్ జింగ్..థాయ్ లాండ్, మయన్మార్ సరిహద్దుల్లో కిడ్నాప్కు గురయ్యాడు. వాంగ్ స్నేహితురాలు చేసిన సోషల్ మీడియా పోస్ట్ తో అతని కిడ్నా ప్ సంగతి తెలిసింది..చైనా నటులు, ప్రముఖులు ఈ పోస్ట్ ను షేర్ చేయడంతో వైరల్ అయింది..ఎట్టకేలకు చైనా ప్రభుత్వం స్పందించివాంగ్ ను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు..అయితే వాంగ్ కిడ్నాప్ వ్యవహారం మయన్మార్ తో పాటు ఆగ్నేసియాలో విస్తరిస్తున్న సైబర స్కామ్ కేంద్రాల గుట్టును రట్టు చేసింది.  

జనవరి 3,2025 న ఇంటర్నెట్లో వాంగ్ స్నేహితురాలు అతని మిస్సింగ్ మెసేజ్ పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. చైనాకు చెందిన వాంగ్ సహ నటులు, ప్రముఖులు..వాంగ్ మిస్సింగ్ పోస్టును షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎట్టకేలకు చైనా ప్రభుత్వం వాంగ్ ను కిడ్నాపర్ల చెరనుంచి విడిపించింది.

వాంగ్ విడుదల కావడంతో గత కొంతకాలంగా కనిపించకుండా పోయిన చైనీయుల జాడకోసం వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని అర్జించారు. స్కామ్ సెంటర్లలో తమ వారు ఇరుక్కున్నారని రక్షించమని వేడుకుంటూ వందలాది మంది చైనీయుల కుటుంబాలు విజ్ణప్తి చేశాయి.  
 
ఇటీవల కాలంలో మయన్మార్ తోపాటు ఆగ్నేషియాలోని ఇతర ప్రాంతాల్లో సైబర్ స్కామ్ బాగా విస్తరించింది. క్రైమ్ సిండికేట్ లు స్కామ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఈ సిండికేట్ల చేతిలో వేలాది మంది బందీలుగా ఉన్నారు. మంచి జీతం, ఉద్యోగ అవకాశాల పేరుతో బాధితులను అట్రాక్ చేస్తున్నారు క్రైమ్ సిండికేట్లు. వీరిని సైబర్ క్రైం నేరాల్లో బలవంతంగా భాగస్వాములను చేస్తున్నారు. బాధితులను నిర్బంధించి క్రైమ్ చేయిస్తున్నారు. చెప్పిన పని చేయకపోతే కొట్టడం, హింసించడం చేస్తున్నారని వాంగ్ వాపోయారు. 

ALSO READ | ట్రంప్ అయితే ఏంటి..? అమెరికాకు ధీటుగా టారిఫ్లు పెంచిన కెనడా, మెక్సికో

మరోవైపు వాంగ్ ఘటనతో థాయ్ లాండ్ ప్రభుత్వం ఇరుకులో పడింది. చైనా పర్యాటకులు థాయ్ లాండ్  వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కొందరు తమ పర్యటన లను రద్దు చేసుకున్నారు. పర్యాటకులు థాయ్ లాండ్ కు అత్యధికంగా చైనా నుంచి వెళుతుంటారు. దీంతో పర్యాటకం దెబ్బతింటుందని థాయ్ ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ లో పడ్డారు. దేశం సురక్షితం అని చైనా పర్యాటకులను బుజ్జగించే పనిలో పడ్డారు. 

వాంగ్ రక్షించబడిన కొద్దిసేపటికే మయన్మార్‌లో తప్పిపోయిన 174 మంది చైనీస్ జాతీయుల కుటుంబాల నుండి ఉమ్మడి పిటిషన్ చైనీస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. వారిని ఇంటికి తీసుకురావడానికి ప్రభుత్వం మరింత సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

వాంగ్ ఒక్కడేకాదు..ఇలా వేల సంఖ్యలో చైనీయులు కిడ్నాప్ చేయబడి స్కామ్ సెంటర్లలో బంధీలుగా ఉన్నారు. వాంగ్ ను రక్షించిన వార్త తెలిసిన వారి భవితవ్యంపై కుటుంబ సభ్యులకు వాంగ్ జింగ్ ను కిడ్నాపర్లు ఓ ప్రత్యేక ప్లేస్ లో బంధించారు.. తల వెంట్రుకలు లేకుండా గుండు గీయించారు. కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి వారనుకున్న పనిలో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు.. బంధీల చెరలో ఉన్న మూడు రోజులు వాంగ్ భయంతో గడిపాడు. 

సినిమా షూటింగ్ కోసం థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ కు వెళ్లిన వాంగ్ ను విమానాశ్రయంలో  కిడ్నాప్ చేశారు దుండగులు. అక్కడి నుంచి సైబర్ మోసాలకు కేంద్రంగా భావిస్తున్న మయన్మార్ లోని మైవాడీ ప్రాంతంలో స్కామ్ సెంటర్ కు తరలించారు.