భారత బాలుడ్ని కిడ్నాప్ చేసిన చైనా

అరుణాచల్ ప్రదేశ్ లో ఓ పదిహేడేళ్ల భారతీయుడ్ని చైనా సైన్యం కిడ్నాప్ చేసింది. అప్పర్ సియాంగ్ జిల్లాలో బాలుడ్ని చైనా సైనికులు కిడ్నాప్ చేసినట్లు అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ గావ్ తెలిపారు. బాధితుడ్ని మిరామ్ తరోన్ గా గుర్తించామన్నారు. అతడి స్నేహితుడు జానీ యాయింగ్.. చైనా జవాన్ల నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరు బాలులు జిడో గ్రామానికి చెందిన వేటగాళ్లని పేర్కొన్నారు.

సాంగ్ పో నది అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించే చోట కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. చైనా సైనికులు చేసిన ఘోరం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపానని.. బాధితుడ్ని త్వరగా విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎంపీ తాపిర్ తెలిపారు. గతేడాది కూడా అరుణాచల్ ప్రదేశ్ లో ఐదుగురు యువకులను చైనా సైన్యం కిడ్నాప్ చేసి.. వారం తర్వాత మళ్లీ విడిచిపెట్టింది.

మరిన్ని వార్తల కోసం: 

6 నెలలకే యాంటీబాడీలు మాయం

ఫైన్​ కట్టి చదివించింది.. 

రాజులు మెచ్చిన గాజుల షాప్