
న్యూఢిల్లీ: చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ బీవైడీ కిందటేడాది రికార్డు స్థాయిలో 107 బిలియన్ డాలర్ల (రూ.9.2 లక్షల కోట్ల) రెవెన్యూ ఆర్జించింది. కంపెనీ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వెహికల్స్ సేల్స్ ఏడాది లెక్కన 40 శాతం పెరిగాయి. యూఎస్ ఈవీ కంపెనీ టెస్లాకు కిందటేడాది వచ్చిన 97.7 బిలియన్ డాలర్ల (రూ.8.40 లక్షల కోట్ల) రెవెన్యూ మార్క్‌ను బీవైడీ దాటింది. కాగా, ఈ కంపెనీ టెస్లా మోడల్3కి పోలి ఉండే క్విన్ ఎల్ ఈవీ సెడాన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ బండి ధర టెస్లా బండి కంటే సగం ఉండడం విశేషం.
బీవైడీ కిందటేడాది 5.6 బిలియన్ డాలర్ల (రూ.48 వేల కోట్ల) నికర లాభం సాధించింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 34 శాతం ఎక్కువ. బీవైడీ సుమారు 43 లక్షల ప్యూర్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను 2024లో విక్రయించింది. ఈ అమ్మకాల్లో సుమారు 29 శాతం చైనాకు వెలుపల జరిగాయి. కంపెనీ కిందటి వారం సూపర్ ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టింది.