మరీ ఇంత దారుణమా: టాయిలెట్ బ్రేక్ రెండు నిమిషాలే.. అది కూడా కంపెనీ ఫిక్స్ చేసిన టైంలోనే

మరీ ఇంత దారుణమా: టాయిలెట్ బ్రేక్ రెండు నిమిషాలే.. అది కూడా కంపెనీ ఫిక్స్ చేసిన టైంలోనే

టాయిలెట్ బ్రేక్ అనేది టాయిలెట్ వెళ్లాల్సి వచ్చినప్పుడే తీసుకుంటాం.. అలా కాకుండా మేము ఫిక్స్ చేసిన టైంలోనే వెళ్ళాలి, అది కూడా రెండు నిమిషాలే వెళ్ళాలి అని కంపెనీ రూల్ పాస్ చేస్తే.. ఉహించటానికే భయంకరంగా ఉంది కదా... ఇక నిజంగానే ఈ రూల్ పాస్ చేస్తే ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఓ కంపెనీ ఇలాంటి రూల్ నే పాస్ చేసింది. టాయిలెట్ కేవలం రెండు నిమిషాలే తీసుకోవాలని, అది కూడా కంపెనీ ఫిక్స్ చేసిన టైం స్లాట్స్ లోనే టాయిలెట్ బ్రేక్ కి వెళ్ళాలంటూ రూల్ పాస్ చేసింది. అంతే కాకుండా ఈ రూల్ ని అతిక్రమిస్తే ఫైన్ కూడా ఉంటుందట.ఇంత విచిత్రమైన, శాడిస్టిక్ రూల్ పెట్టిన కంపెనీ ఏది, అది ఏ దేశంలో ఉందో.. ఇప్పుడు తెలుసుకుందాం.

అది దక్షిణ చైనాలోని త్రీ బ్రదర్స్ మెషీన్  మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ.. ఆ కంపెనీలో పనిచేసే ఉసద్యోగులు టాయిలెట్ వాడటానికి కొన్ని రూల్స్ పెట్టింది కంపెనీ. ఉద్యోగులు ఎవరైనా టాయిలెట్ వాడాలంటే కేవలం రెండు నిమిషాలే వాడాలని రూల్ పెట్టింది సదరు కంపెనీ. అది కూడా కంపెనీ ఫిక్స్ చేసిన టైం స్లాట్స్ లోనే టాయిలెట్ బ్రేక్ కి వెళ్లాలని రూల్ పాస్ చేసింది. ఎవరైనా ఈ రూల్ ని వాయిలేట్ చేస్తే ఫైన్ వేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది.

టాయిలెట్ వాడేందుకు టైం స్లాట్స్:

కంపెనీ ఫిక్స్ చేసిన టైం స్లాట్స్ లోనే టాయిలెట్ వాడాలని పేర్కొంది కంపెనీ. ఉదయం 8 గంటలకు ముందు, 10 :30 గంటల నుండి 10: 40 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటలకు, 1: 30 గంటలకు, సాయంత్రం 3: 30గంటల నుండి 3: 40గంటల వరకు, 5: 30 గంటల నుండి 6గంటల వరకు కంపెనీ ఫిక్స్ చేసిన టైం స్లాట్స్ లోనే టాయిలెట్ వాడాల్సి ఉంటుంది. ఓవర్ టైం వర్క్ చేసే ఉద్యోగులు అయితే.. రాత్రి 9 గంటల తర్వాత కూడా టాయిలెట్ వాడుకోవచ్చని తెలిపింది యాజమాన్యం. 

టాయిలెట్ వాడకంపై బ్యాన్:

ఉదయం, మధ్యాహ్నం సమయంలో టాయిలెట్ వాడకంపై నిషేధం విధించటమే ఈ రూల్ వెనక ఉద్దేశమని తెలుస్తోంది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకొని ఈ రూల్ నుంచి మినహాయింపు పొందొచ్చు. ఈ రూల్ స్ట్రిక్ట్ గా అమలు చేసేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిందట సదరు కంపెనీ. ఫిబ్రవరి 11 నుంచి ఈ రూల్ పై ట్రయిల్ నిర్వహిస్తున్న కంపెనీ.. మార్చి 1 నుండి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపింది.