కొడుకు మృతి కేసు కోసం.. లాయర్ గా మారిన పోలీస్ ఆఫీసర్

ఓ పోలీసు లాయర్​గా మారాడు. తన కుమారుడి మరణానికి స్కూల్​ టీచరే కారణమని నిరూపించేందుకు సిద్దమయ్యాడు.  తన కుమారుడి మరణానికి కారణమైన ఉపాధ్యాయుడిని శిక్షించాలని కోర్టులో వాదించాడు.  వివరాల్లోకి వెళ్తేతూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని ప్రాథమిక పాఠశాలలో జాంగ్ కువాన్‌ అనే11 సంవత్సరాల బాలుడు చదువుతున్నాడు.  2021, నవంబర్​ 9న  స్కూలు ఎదురుగా ఉన్న 24 అంతస్థుల భవనంపై నుంచి దూకాడు. కువాన్‌​ ఆత్మహత్యకు  క్లాస్​ టీ జూ అని నోట్​ రాశాడు.

  జాంగ్​ కువాన్​ తండ్రి జాంగ్​ డిగ్జీ చైనాలో పోలీసు అధికారి. అతని భార్య వాంగ్ బెయిలీ సైకలాజికల్ కౌన్సెలర్.  వీరు తమ కుమారుడు కువాన్​ కు న్యాయం జరిగేందుకు డిగ్జీ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన లాయర్​ అయ్యాడు. చిన్నారి మరణించిన తరువాత స్కూల్లోని సీసీ కెమెరా ఫుటేజ్​ పరిశీలించారు. కువాన్​ మరణించిన రోజు ( 2021, నవంబర్​ 9) టీచర్​ జూ అతని పట్ల దారుణంగా వ్యవహరించాడని గుర్తించారు. 


మాజీ ట్రాఫిక్ పోలీసు అధికారి జాంగ్ డింగ్జీ... తన కొడుకు జాంగ్ కువాన్‌కు న్యాయం చేయాలని కోరుతూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.  తన కుమారుడి కేసును కోర్టులో వాదిస్తూ... తన కుమారుడి మరణానికి కారణమైన క్లాస్​ టీచర్​ జూను కఠినంగా శిక్షించాలని కోర్టును కోరారు.  కువాన్​ మరణానికి ముందు ఓ నోట్​ రాశాడు. నా మరణానికి  నా తల్లిదండ్రులు గాని.. సమాజం గాని కారణం కాదు.  నన్ను నా క్లాస్​ టీచర్​ జూ తరచూ ఇబ్బంది పెడుతున్నాడు.  నా మరణానికి ఆయనే కారణమని నోట్​లో పేర్కొన్నాడు.  నోట్​ బుక్​ లో పేజీ చిరగడంతో ఎగతాళి చేస్తూ మాట్లాడానని.. పాఠశాల ఎదురుగా ఉన్న భవాన్ని చూపిస్తూ దానిపై నుంచి  దూకు అని పిల్లవాడు అవమానపడేలా మాట్లాడని  డింగ్జీ తెలిపాడు.  దీంతో తన కుమారుడు  అవమానంతో పాఠశాల ఎదురుగా ఉన్న 24 అంతస్థుల భవనంపై నుంచి దూకాడని కోర్టుకు తెలిపాడు. 

టీచర్​ జూ .. విద్యార్థి అబద్దం చెబుతున్నాడని ఆరోపించాడు.  అతని పరిక్షల్లో మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని అడిగానని జూ  తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. కువాన్​ తండ్రి డింగ్జీ ఆధారాలు సేకరించిన తరువాత టీచర్​ పై దావా వేయడానికి న్యాయవాదిగా మారాడు.  విద్యార్థి మరణించిన రెండు నెలల తరువాత జూ ను ఉద్యోగం నుంచి తొలగించారు.  2023 ఆగస్టులో మొదటి విచారణ జరిపిన కోర్టు జూను నిర్దోషిగా ప్రకటించింది.  అయితే విచారణ సమయంలో సేకరించిన సీసీ ఫుటేజ్​ సాంకేతిక సమస్యల కారణంగా ప్లే కాలేదు.   

కువాన్​ తండ్రి డింగ్జీ మళ్లీ 2023 నవంబర్​ లో టీచర్​ జూను మళ్లీ కోర్టుకు పిలిపించారు.  తన కుమారుడి మరణానికి కారణమైన టీచర్​ జూ ను చట్టరీత్యా శిక్షించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తన కుమారుడి లాగా స్కూల్లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్నారు. అతని భార్య వాంగ్ బెయిలీ సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్న వారికి ఉచితంగా కౌన్సింగ్​ ఇస్తున్నారు.  ఇప్పటి వరకు 100 కుంటుంబాలకు ఉచిత సేవలు అందించారు.  తమ కుమారుడు మరణించినప్పటికినీ... స్కూల్​ టీచర్ల వేధింపుల బారి నుండి ఇతర పిల్లలను రక్షించడమే తమ లక్ష్యమని కువాన్​ తల్లిదండ్రులు తెలిపారు.