చైనా మాల్ అంటేనే గోల్ మాల్. అక్కడ తయారు చేసిన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా గ్యారెంటీ ఉండదు. ప్రజలకు నమ్మకం కూడా ఉండదు. ఎందుకంటే చైనాలో తయారైన వస్తువులు ఎప్పుడు ఖరాబ్ అయిపోతాయో తెలియని పరిస్థితి. ఇందుకు ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. చైనాలో తయారైన ఓ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ రన్నింగ్లోనే రోడ్డు మధ్యలో పడిపోయింది. చైనా సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డులో నగరంలోని రింగ్ రోడ్‌పై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ రోడ్డుపై పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఏమైందంటే..
చైనా సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డులోని 2వ రింగ్ రోడ్‌లో ఓ ఎలక్ట్రిక్ కారు వెళ్తోంది. అయితే ఒక్కసారిగా ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ రహదారి మధ్యలో పడిపోయింది. కొద్ది దూరం వెళ్లాక కారును ఆపేశాడు డ్రైవర్. రోడ్డు మధ్యలో పడిపోయిన కారు బ్యాటరీని మరో వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అయితే ఇది కావో కావో ఆటో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీకి చెందిన బ్యాటరీ. ఈ కారును ఈఏడాది మార్చి 29 గ్రీలీ లాంఛ్ చేశాడు. ఈ కార్లలోని బ్యాటరీని ఎప్పుడంటే అప్పుడు బయటకు తీయొచ్చు. పెట్టొచ్చు. కావో కావో EVలోని బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 60 సెకన్లలో మార్చుకోవచ్చని కంపెనీ హెడ్ గీలీ పేర్కొన్నారు. అయితే కారు నుంచి బ్యాటరీ పడిపోవడానికి కారణం బోల్ట్‌లలో ఒకటి సరిగ్గా బిగించి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
చైనా కార్లంతే...
రోడ్డు మధ్యలో కారు నుంచి బ్యాటరీ బయటపడిపోవడంపై ప్రపంచ వ్యాప్తంగా వాహనదారులు సోషల్ మీడియాలో చైనాను ట్రోల్ చేస్తున్నారు. చైనాలో తయారైన అన్ని వస్తువులు అలాగే ఉంటాయని ఎద్దేవా చేస్తున్నారు. అక్కడి వస్తువులకు గ్యారెంటీ ఉండదంటున్నారు. చైనా వస్తువులను కొనుగోలు చేసేవారు ఆలోచించాలని హెచ్చరిస్తున్నారు.