భారత ఆర్మీ అదుపులో చైనా జవాన్

భారత ఆర్మీ అదుపులో చైనా జవాన్

బార్డర్ దాటొచ్చిండని అదుపులోకి తీసుకున్న ఆర్మీ

లడఖ్: మన భూభాగంలోకి వచ్చిన చైనా జవానును ఆర్మీ అదుపులోకి తీసుకుంది.ఈస్టర్న్ లడఖ్‌లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంబడి టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్న వేళ చైనా జవాను పట్టుబడటం కలకలం రేపింది.  ‘శుక్రవారం తెల్లవారుజామున లడఖ్‌లోని పాంగాంగ్ సో లేక్ దగ్గర మన భూభాగంలోకి చైనా జవాను వచ్చాడు.  ఆ ఏరియాలోని మన బలగాలు అతడిని కస్టడీలోకి తీసుకున్నయి’ అని ఆర్మీ శనివారం వెల్లడించింది. బార్డర్ ఎందుకు దాటాల్సి వచ్చిందనే అంశంపై విచారిస్తున్నట్టు తెలిపింది. చైనా ఆర్మీకి సమాచారం ఇచ్చామని, ఈ అంశంపై రెండు దేశాలూ టచ్‌లో ఉన్నట్టు చెప్పింది. మూడు నెలల్లో  ఇది రెండో ఘటన అని తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 19న లడఖ్‌లోని డెమ్ చక్ సెక్టార్‌‌లో మన టెర్రిటరీలోకి వచ్చిన జవానును బలగాలు పట్టుకున్నాయి. తర్వాత ప్రోటోకాల్స్ ప్రకారం చుషుల్ -మోల్డో బార్డర్ పాయింట్ వద్ద చైనాకు అప్పగించాయి.

For More News..

కడ్తుంటే చూస్తున్రు.. కట్టినంక కూల్చేస్తున్రు.. అధికారుల నిర్వాకం

‘అమ్మా పోయొస్త.. పిల్లలు పైలం’.. మళ్లీ వలస బాట పట్టిన పాలమూరు కార్మికులు

కుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి