ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఇలాంటి సందర్భాలు దాదాపు మనం సినిమాల్లోనే చూస్తుంటాం.. ఆమెకు 30 ఏళ్లు.. పండంటి పిల్లాడికి జన్మనిచ్చి తల్లైంది. అయితే పుట్టిన పిల్లాడు నల్లగా ఉన్నాడని తండ్రికి అనుమానం. పిల్లాడి తండ్రి ఎవరని ఆమె భర్త పెటర్నటీ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. చైనీస్ అంటే సాధారణంగా తెల్లగానో.. ఎర్రగానో ఉంటారు. కానీ.. పుట్టిన పిల్లాడు నల్లగా పుట్టాడని భర్త ఆ బిడ్డను ముట్టుకోవడం లేదు. దీంతో ఆ మహిళ తనకు వచ్చిన పరిస్థితి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహిళ చేసిన పోస్ట్ Weiboలో సంచలనం సృష్టించింది. ఆ పోస్ట్ వైరల్ అయ్యింది.
చైనాలో 30ఏళ్ల మహిళ మగ పిల్లాడికి జన్మనిచ్చింది. ఆమె భర్త హాస్పిటల్ కు వెళ్లి బాబును చూడగానే ఆశ్యర్యపోయాడు. పిల్లాడు నల్లగా పుట్టాడని భర్త ఆమెను అనుమానించాడు. బాబుకు ఉన్న కలర్ వారిద్దరిలో ఎవరికీ లేదని అనుమాణం వ్యక్తం చేశాడు. పిల్లాడికి పెటర్నటీ టెస్ట్ చేయించాలని కోరాడు. ఆ మాట విన్న మహిళ ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది. తల్లైన ఆనంద క్షణాల్లోనే ఆమె చాలా బాధపడిందని ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేసింది. ఆమె ఆఫ్రికాకు ఎన్నడూ వెళ్లలేదని.. నల్లజాతీయులెవరూ తెలియదని అందులో రాసుకొచ్చింది. భర్త మాత్రం బాబును అలానే చూస్తూ ఎత్తుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. దీంతో తల్లి పెటర్నటీ(తండ్రి నిర్థారణ) టెస్ట్‌కు అంగీకరించింది.
DNA పరీక్ష చేయించగా.. ఆ పిల్లాడు అతనికే పుట్టాడని తేలింది. భర్తకు తనపై నమ్మకం లేదని.. తనని చాలా బాధపెట్టాడని ఆ మహిళ విడాకులు తీసుకుంది. భర్త తీరు వల్ల రిలేషన్‌షిప్‌లో ట్రస్ట్ అనేది లేకుండా పోయిందని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. పిల్లాడిని పెంచుకుంటూ ఆ మహిళ జీవనం సాగిస్తుంది.
అప్పుడే పుట్టిన పిల్లాడికి పలుచని స్కిన్, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల నల్లగా పుట్టి ఉంటాడని డాక్టర్లు చెప్పారు. చాలామంది నవజాత శిశువులు నల్లగానే ఉంటారని.. తర్వత వారి తల్లిదండ్రుల రంగు వస్తారని పిల్లల వైద్య నిపుణులు చెప్పుకొచ్చారు.